Home /News /trending /

WORLD THIRD MOST EXPENSIVE NUMBER PLATE AUCTIONED FOR RS 70 CRORE IN DUBAI PVN

Costly Number Plate : ఆ నెంబర్ ప్లేట్ కోసం..ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే అవాక్కవడం ఖాయం

వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన నెంబర్ ప్లేట్

వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన నెంబర్ ప్లేట్

Costly Number Plate :  సాధారణంగా నెంబర్ ప్లేట్స్ విషయంలో ఫ్యాన్సి నెంబర్ల కోసం కొందరు ఎంత ఖర్చు చేసేందుకు అయినా వెనుకాడరు. కొంత మంది ఏకంగా కోట్లు వెచ్చించి మరీ నెంబర్ ప్లేట్లను సొంతం చేసుకుంటారు

Costly Number Plate :  సాధారణంగా నెంబర్ ప్లేట్స్ విషయంలో ఫ్యాన్సి నెంబర్ల కోసం కొందరు ఎంత ఖర్చు చేసేందుకు అయినా వెనుకాడరు. కొంత మంది ఏకంగా కోట్లు వెచ్చించి మరీ నెంబర్ ప్లేట్లను(Number Plates) సొంతం చేసుకుంటారు. చాలా చోట్ల ఆర్టీఐ శాఖ వారు ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్లను వేలం వేసి ఆదాయం సంపాదిస్తుంటారు. మన దగ్గర సింగిల్ నెంబర్ ఉన్న నెంబర్ ప్లేట్లకు బాగా డిమాండ్ ఉంటుంది. వాటి కోసం లక్షలు వెచ్చిస్తారు. కానీ ఈ వేలం వెర్రి అంతర్జాతీయ స్థాయిలో కూడా బాగానే ఉంది. తాజాగా దుబాయిలో ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఒకటి దాదాపు రూ.70 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అక్కడి జనం ముక్కున వేలేసుకున్నారు.

యూఏఈలోని దుబాయ్‌(Dubai) లో తాజాగా నెంబ‌ర్ ప్లేట్ల వేలం నిర్వహించారు. అక్కడి కార్లకు కేటాయించే ప్రత్యేకమైన నెంబ‌ర్ ప్లేట్ల‌ను జారీ చేసి ఆసక్తి కలవారిని కొనుగోలు చేయాల్సిందిగా ప్రకటన విడుదల చేసారు. అంతేకాదు పనిలోపనిగా ఫ్యాన్సీ మొబైల్ ఫోన్ నెంబ‌ర్ల‌ను కూడా వేలం వేశారు. ఈ వేలంలో AA8 నెంబ‌ర్ ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన మూడ‌వ నెంబ‌ర్ ప్లేట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. AA8 సింగిల్ డిజిట్ నెంబ‌ర్ దుబాయ్ వేలంలో 35 మిలియ‌న్ల దీర‌మ్‌ల‌కు అమ్ముడుపోయింది. అంటే మ‌న క‌రెన్సీలో దాని విలువ రూ.70 కోట్లు. గ‌త ఏడాది AA9 నెంబ‌ర్ ప్లేట్‌ను రూ.79 కోట్ల‌కు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా,తాజాగాదుబాయ్ లో జరిగిన కార్యక్రమలో ఫ్యాన్సీ మొబైల్ ఫోన్ నెంబ‌ర్ల‌ను కూడా వేలం వేశారు.

ALSO READ Murder Case : అర్థరాత్రి ఆగలేక భార్యతో వాట్సాప్ చాట్..అసలు ట్విస్ట్ ఇక్కడే..డామిట్ కథ అడ్డం తిరిగింది

దుబాయ్‌లోని ఆర్టీఏ నిర్వహించిన వేలంలో డ‌బుల్ డిజిట్ కారు నెంబ‌ర్ ప్లేట్ F55...రూ. 8.23 కోట్ల‌కు అమ్ముడుపోయింది. మ‌రో కార్ ప్లేట్ V66కు కూడా వేలంలో భారీ ధ‌ర ప‌లికింది. ఆ నెంబ‌ర్ ప్లేట్‌ రూ.7.91 కోట్ల‌కు అమ్ముడు పోయింది. వ‌న్ బిలియ‌న్ మీల్స్ సంస్థ కోసం ఈ వేలం ద్వారా 53 బిలియ‌న్ల దీర‌మ్‌ లు ఆర్జించారు. ఆ డ‌బ్బుతో 50 దేశాల్లో నిరుపేద‌ల‌కు ఆహారం అందించే కార్యక్రమం సాగుతోందిని సదరు సంస్థ తెలిపింది. దుబాయ్‌ లోని ఆర్టీఏ తాజా వేలాన్ని ఆర్గ‌నైజ్ చేసింది. మరోవైపు, మన దేశంలోని చండీగఢ్ రిజిస్టరింగ్ లైసెన్సింగ్ అథారిటీ ఇటీవల నిర్వహించిన వేలంలో చండీగఢ్‌లోని ఒక హోండా యాక్టివా యజమాని సూపర్ VIP 0001 నంబర్ ప్లేట్‌ను పొందేందుకు రూ. 15 లక్షలకు పైగా చెల్లించాడు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Dubai, Fancy numbers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు