పండంటి కాదు.. పండంత బరువైన బిడ్డ.. ఎక్కడ పుట్టాడో తెలుసా..

Viral News | పండంటి బిడ్డ పుట్టాలని అంటారు. ఇది ఏదో మాటవరుసకి చెబుతారు. కానీ టోక్యోలో మాత్రం నిజంగానే జరిగింది. ఓ పసిబిడ్డ యాపిల్ పండంత బరువుతో పుట్టాడు.

news18-telugu
Updated: April 20, 2019, 2:09 PM IST
పండంటి కాదు.. పండంత బరువైన బిడ్డ.. ఎక్కడ పుట్టాడో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 20, 2019, 2:09 PM IST
ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువుతో బిడ్డ పుట్టాడు. జపాన్‌లో 2018 అక్టోబర్ 1న 258 గ్రాముల బరువుతో బిడ్డ పుట్టాడు. ఖచ్చితంగా చెప్పాలంటే ఓ యాపిల్ పండు బరువుతో సమానంగా. టోషిక అనే గర్భిణి అధిక రక్తపోటుతో బాదపడుతుండడంతో ఆమెకి 24 వారాల 5 రోజులకే అత్యవసరంగా సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేశారు. అతి తక్కువ బరువుతో 22 సెంటిమీటర్ల పొడవుతో బాబు పుట్టాడు. దీంతో.. నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి సంరక్షించి 7 నెలల తర్వాత బయటికి తీసుకొచ్చారు వైద్యులు.

తక్కువ బరువుతో పుట్టిన బాబుకి తల్లిదండ్రులు సెకియా అని పేరు పెట్టారు. 7 నెలల చికిత్స అనంతరం 13 రెట్లు పెరిగి ప్రస్తుతం 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడు సెకియా. దీంతో.. బాబుని డిశ్చార్జి చేసేందుకు నగానో పిల్లల ఆస్పత్రి అన్నీ ఏర్పాట్లు చేశారు. అయితే.. సెకియా కంటే ముందు జపాన్‌లో 268 గ్రాముల బరువుతో ఓ బాబు పుట్టినప్పటికీ.. అంతకంటే 10 గ్రాముల తక్కువగా 258 గ్రాముల బరువుతోనే సెకియా రికార్డుని చెరిపేయడం విశేషం.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...