Home /News /trending /

WORLD SLEEP DAY DONT NEGLECT SLEEP LACK OF SLEEP MAY SHRINK YOUR BRAIN RA

World Sleep Day: లేటుగా నిద్రపోతే మెదడు చురుకుతనం కోల్పోవడం తథ్యం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

World Sleep Day | పని కారణమో.. మరే ఇతర కారణమో.. చాలామంది లేటుగా పడుకుంటుంటారు. ఇలాంటి వారు జాగ్రత్త పడాలి. ఎందుకంటే.. రెగ్యులర్‌గా లేటుగా నిద్రపోయేవారికి మెదడు సరిగ్గా పనిచేయదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

చాలామందికి ఆఫీసుల నుంచి వచ్చి టీవీ, వీడియోస్, గేమ్స్, చాటింగ్ చేస్తూ లేటుగా నిద్రపోవడం అలవాటు. దీని కారణంగా లేటుగానే లేస్తారు. ఈ అలవాట్లు మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ, ఏం పర్లేదు అంతగా ఏం ఇబ్బంది ఉంటుందని లైట్ తీస్కొని అలానే చేస్తారు. కానీ, జాగ్రత్త.. ఇకనుంచి మీరు.. నిద్రపోయి, లేచే టైమ్‌ని మార్చకపోతే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఏవో చెప్పాలని చెబుతున్న మాటలు కాదు.. యూకేలోని కొంతమంది వైద్య నిపుణులు ఇటీవల చేసిన సర్వేలో తేలిన పచ్చి నిజాలు.

లేటుగా నిద్రపోయేవారి మెదడు మందగించి.. రోజూవారీ పనుల్లో అవరోధాలు ఏర్పడతాయట. అంతేకాదు.. చురుకుతనం, ఏకాగ్రత లోపించి ఏదో ఉన్నామంటే.. ఉన్నాం.. చేశామంటే చేశామన్న చందంగానే ఉంటారట.


మీ మెదడు చురుగ్గా పనిచేయాలన్నా...ఏకాగ్రత బాగా ఉండాలన్నీ సరైన సమయంలో పడక గదికి వెళ్లాల్సిందే. గాఢ నిద్రతో మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది.  లేటుగా నిద్రపోయే వారు ఇప్పటికైనా కాస్త మీ జీవనవిధానాన్ని మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

First published:

Tags: Health Tips, HOME REMEDIES, Tips For Women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు