ప్రపంచ పొట్టి మనిషి... ఖగేంద్ర థాపా మాగర్ మృతి...

నేపాల్‌కి చెందిన ఖగేంద్ర థాపా మాగర్... 27 ఏళ్లకే నిమోనియాతో చనిపోవడం విషాదకరం. ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తిగా అతని పేరున గిన్నీస్ బుక్ రికార్డ్ ఉంది.

news18-telugu
Updated: January 18, 2020, 10:56 AM IST
ప్రపంచ పొట్టి మనిషి... ఖగేంద్ర థాపా మాగర్ మృతి...
ప్రపంచ పొట్టి మనిషి... ఖగేంద్ర థాపా మాగర్ మృతి...
  • Share this:
సాధారణంగా మనుషులు 5 అడుగులు ఎత్తు పెరుగుతారు. నేపాల్‌కి చెందిన ఖగేంద్ర థాపా మాగర్ మాత్రం 67.08 సెంటీమీటర్లు (2 అడుగుల 2.41 ఇంచులు) ఎత్తు మాత్రమే. నేపాల్ రాజధాని ఖాట్మండుకి... 200 కిలోమీటర్ల దూరంలోని పోఖారాలో ఉన్న ఆస్పత్రిలో నిమోనియోకి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ప్రాణాలు విడిచాడు. సాధారణంగా పొట్టిగా ఉండేవారు (మరుగుజ్జు) నడవడం కష్టం. పొట్టిగా ఉంటూ కూడా నడవగలుగుతున్న వ్యక్తిగా... గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్... 2010లో ఖగేంద్రను గుర్తించింది. అప్పట్లో ఆయన వయసు 18 ఏళ్లు. గిన్నీస్ బుక్ వారు ఇచ్చిన సర్టిఫికెట్... ఖగేంద్ర కంటే కాస్త చిన్నదిగా మాత్రమే ఉండేది. అంత పొట్టిగా ఉండేవాడు. ఇదివరకు కూడా ఆయనకు నిమోనియా సమస్య ఉంది. ఈసారి అది గుండెపైనా ప్రభావం చూపింది. అందువల్లే ఖగేంద్ర చనిపోయినట్లు అతని సోదరుడు మహేష్ థాపా మాగర్ తెలిపాడు.


మధ్యలో కొంతకాలం... ఖగేంద్ర గిన్నీస్ రికార్డును 54.6 సెంటీమీటర్లు ఎత్తుండే నేపాల్‌కే చెందిన చంద్ర బహదూర్ డాంగీ కొట్టేశాడు. ఐతే... 2015లో డాంగీ చనిపోవడంతో... తిరిగి ఆ రికార్డు ఖగేంద్రకు దక్కింది. ఖగేంద్ర పుట్టినప్పటి నుంచీ చిన్నగా ఉండేవాడు. పుట్టినప్పుడు అరచేతిలో పట్టేంత చిన్నగా ఉండటంతో... అతనికి స్నానం చేయించడం కూడా కష్టంగా ఉండేదట. 6 కేజీల బరువు ఉండి... పొట్టి రికార్డ్ సాధించిన ఖగేంద్ర... దాదాపు 12 దేశాలు తిరిగాడు. అమెరికా, యూరప్ దేశాల్లో టీవీల్లో కనిపించాడు. ఖగేంద్ర మరణం తమకు బాధ కలిగిస్తోందని గిన్నీస్ రికార్డు ఎడిటర్ ఇన్ ఛీఫ్ క్రైగ్ గ్లెండే తెలిపారు.

నిన్నటివరకూ నేపాల్ టూరిజం క్యాంపెయినర్‌గా ఖగేంద్ర ఉన్నాడు. అతన్ని ఎవరెస్టుపై ఎక్కించిన నేపాల్ ప్రభుత్వం... ప్రపంచంలోనే అత్యంత పొట్టి మనిషి... అత్యంత ఎత్తైన శిఖరంపై అని ప్రచారం చేసుకుంది. తన విదేశీ పర్యటనల్లో ఖగేంద్ర చాలా మంది పొట్టి వారిని కలుసుకున్నాడు. ఇండియాలో అత్యంత పొట్టి మహిళ అయిన జ్యోతీ అమ్గేని కూడా కలిశాడు.


ప్రస్తుతం ప్రపంచంలో పొట్టి వ్యక్తిగా ఫిలిప్పీన్స్‌కి చెందిన జున్రీ బలావింగ్ ఉన్నాడు. అతని ఎత్తు 59.93 సెంటీమీటర్లు. ఐతే... అతను నడవలేడు. ఏ సాయమూ లేకుండా నిల్చోలేడని గిన్నీ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. ఇప్పుడు ఖగేంద్రలా నడవగలిగే పొట్టి వ్యక్తిగా కొలంబియాకి చెందిన ఎడ్వార్ట్ నినో నిలవబోతున్నాడు. అతని ఎత్తు 70.21 సెంటీమీటర్లు.
Published by: Krishna Kumar N
First published: January 18, 2020, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading