World Record Marriages: ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు అంటారు మన పెద్దలు... మరో మాట కూడా అన్నారు... వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చెయ్యాలి అని నిజమే... ఎందుకంటే పెళ్లి అనేది మన దేశంలో పెద్ద కార్యక్రమం. నిశ్చితార్థం, తాంబూలాలు, శుభ లేఖలు, బంధువుల రాక... మ్యారేజ్ ఫంక్షన్ హాల్... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే... పెద్ద లిస్టే. మరి ఒక్క పెళ్లికే ఇంత ఉంటే... ఒకే రోజు 3229 పెళ్లిళ్లు జరగడం మాటలా. కచ్చితంగా విశేషమే. అందుకే ప్రపంచ రికార్డు తల వంచింది. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ కార్యక్రమం చేరింది. మరి ఇది జరిగింది ఎక్కడో కాదు... మన దేశంలోనే.
ఛత్తీస్‌గఢ్... రాయ్‌పూర్‌లోని ఇండోర్ స్టేడియం... సామూహిక వివాహాలతో కళకళలాడింది. అక్కడ నిన్న 233 పెళ్లిళ్లు జరిగాయి. సరిగ్గా ఇవి జరిగేటప్పుడే... రాష్ట్రంలోని 22 జిల్లాల్లో సామూహిక వివాహాలు జరిగాయి. మొత్తం 3229 వివాహాలు నిన్న జరిగాయి. వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాయ్‌పూర్‌లో ఇండోర్ స్టేడియంలో జరిగిన పెళ్లి వేడుకలకు కనెక్ట్ చేశారు. వీటిలో హిందు, ముస్లిం, క్రిస్టియన్ అని తేడా లేకుండా... అన్ని మతాల జంటలూ ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే... ఈ పెళ్ళిళ్లకు ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ పెద్దగా వచ్చారు. వధూవరులను ఆశీర్వదించారు. ఇందులో మరో స్పెషల్ ఏంటంటే... ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ నిర్వహించింది. అందుకే ఇది వైరల్ అయ్యింది.
आज राजधानी रायपुर के बलबीर सिंह जुनेजा इंडोर स्टेडियम परिसर में आयोजित मुख्यमंत्री कन्या विवाह समारोह में शामिल होकर नव दम्पत्तियों को आशीर्वाद दिया।
छत्तीसगढ़ में पहली बार 22 जिलों में एक साथ इस योजना के अंतर्गत सामूहिक विवाह समारोह का आयोजन किया गया।
सभी को ढेर सारी शुभकामनाएं। pic.twitter.com/942dTTdpCa
కల్యాణ దానం కంటే గొప్పది ఏముంటుంది. పవిత్రమైన మాఘ పూర్ణిమ రోజున ఈ వివాహాలు జరగడం గొప్ప విషయం అన్నారు సీఎం భూపేశ్ బఘేల్. ఈ సందర్భంగా ఆయన... కన్య వివాహ్ యోజన కింద ఇస్తున్న రూ.15,000 బదులు రూ.25,000 ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో కొత్త జంటల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.