World organ donation day: నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవం.. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటంటే..?
ప్రపంచ అవదాయ దాన దినోత్సవం (ప్రతీకాత్మక చిత్రం)
చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడటమే కాకుండా చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుంది. కర్ణుడు బతికుండగానే తన కవచ కుండలాలను దానం చేసి చిరస్మరణీయుడయ్యాడు. మనం చనిపోయాక అవయవాలు దానం చేయలేమో. మట్టిలో కలిసి, బూడిదగా మారే మన అవయవాలను మరొకరికి జీవితాల్లో వెలుగు నింపడానికి అందివ్వలేమా?
అవయవ దానం కొందరిని చిరస్మరణీయులను చేస్తూ .. మరికొందరు జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అవయవ దానం వల్ల ఒక్క మనిషి పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్టవచ్చు. గుండె, మూత్రపిండం, కాలేయం, పాంక్రియాస్, చేతులు, ముఖం, కళ్లు, ఎముక మూలుగ, కణాలు ఇలా దాదాపు 200 అవయవాలు దానం చేయవచ్చు. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడటమే కాకుండా చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుంది. కర్ణుడు బతికుండగానే తన కవచ కుండలాలను దానం చేసి చిరస్మరణీయుడయ్యాడు. మనం చనిపోయాక అవయవాలు దానం చేయలేమో. మట్టిలో కలిసి, బూడిదగా మారే మన అవయవాలను మరొకరికి జీవితాల్లో వెలుగు నింపడానికి అందివ్వలేమా?.. ఆధునికి యుగంలో మొదటి సారిగా 1954లో రోనాల్డ్ హెర్రిక్ అనే వ్యక్తి, తన సోదరుడికి కిడ్నీ దానం చేశాడు. ఈ ఆపరేషన్ ని డాక్టర్ ముర్రే నిర్వహించారు. అవయవ దానంతో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినందుకు 1990లో నోబెల్ బహుమతి వచ్చింది. 2015లో అప్పుడే పుట్టిన పాపాయి కిడ్నీలు దీర్ఘకాల కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి దానం చేసారు. అలాగే ఎక్కువ వయసు ఉండి అవయవాలు దానం చేసిన వారిలో 107 ఏళ్ళ మహిళ చరిత్రకెక్కింది. స్కాట్లాండుకు చెందిన ఈ మహిళ తన మరణం తర్వాత కళ్లని దానం చేసింది. ఇండియాలో అవయవ దానం చేయడానికి చాలామంది వెనక్కి తగ్గుతారు. మొత్తం మీద 0.01శాతం మంది మాత్రమే అవయవ దానం చేయడానికి వస్తున్నారని సమాచారం. వీరంతా అవయవ దానం చేసి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. నేడు ఆగస్టు 13. ప్రపంచ అవయవదాన దినోత్సవం. ఈ నేపథ్యంలో అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన పెంచి దాని ద్వారా మరికొంత మంది జీవితాల్లో ఎలా వెలుగులు నింపుతుందో ఒక సారి చూద్దామా....
ఎవరు దానం చేయవచ్చు..
ఎవరైనా ఏ వయసు వారైనా అవయవ దానం చేయవచ్చు. 18 సంవత్సరాల లోపు వారు అవయవ దానం చేయాలనుకుంటే వారి తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 'జీవన్' అనే సంస్థను ఏర్పాటు చేసింది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ సంస్థ పని చేస్తుంది. ఎవరికైనా అవయూలు కావాల్సి వస్తే.. ఇందులో పేరు నమోదు చేసుకోవాలి, వారికి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి సేకరించిన అవయవాలను నిపుణుల పర్యవేక్షణలో వినియోగిస్తారు.
కొందరికి పుట్టుకతోనే గుండె జబ్బులు ఉంటాయి. మరికొందరికి కాలక్రమంలో కొత్త రోగాలు వస్తాయి. అంధులుగా పుట్టే వారికి దాతల నుంచి సేకరించిన నేత్రాలను అమరిస్తే వారు మళ్లీ ఈ లోకాన్ని చూడగలుగుతారు. కొందరికి గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధులతో అవి పూర్తిగా పాడై పోతాయి. కాలేయ సంబంధ సమస్యలకు కాలేయ మార్పిడి అవసరం, దాతల నుంచి సేకరించిన అవయవాలను వారికి పెట్టటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. రోడ్డు ప్రమాదాన్ని తీవ్రంగా గాయపడి, బ్రెయిన్ డెడ్ అయినవారికి అలాగే కొన్ని వ్యాధులకు చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయితే వారి అవయవాలను ఇతరులకు అమర్చేందుకు సేకరిస్తారు. ఎవరైనా బ్రెయిన్ డెడ్ గతే వారి కుటుంబ సభ్యులను జీవనాద్ ప్రతినిధులు కలుస్తారు. అన్నీ విషయాలు వారికి వివరిస్తారు. వారి అనుమతితో అవయవాలను సేకరించి రోగులకు అమరుస్తారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.