HOME »NEWS »TRENDING »world most venomous snake in swimming pool shocks adelaide family getting viral hsn

స్విమ్మింగ్ పూల్ లో షాకింగ్ సీన్.. ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనయింది..!

స్విమ్మింగ్ పూల్ లో షాకింగ్ సీన్.. ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనయింది..!
స్విమ్మింగ్ పూల్ లో విషపూరితమైన పాము

అడిలైడ్ లోని మరైనో ప్రాంతంలో ఓ వ్యాపారవేత్తకు సంబంధించిన ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఒకటి దూరింది. ఎలా వెళ్లిందో కానీ, ఏకంగా స్విమ్మింగ్ పూల్ లోకి చొరబడింది. ఎంచక్కా హాయిగా ఈతకొడుతూ, తన తాపాన్ని తీర్చుకోసాగింది. ఆ ఇంటి యజమాని దీన్ని గ్రహించి వెంటనే స్నేక్ క్యాచర్స్ కు ఫిర్యాదు చేశాడు.

  • Share this:
    రోజూలాగానే ఆ కుటుంబం పొద్దున్నే నిద్రలేచింది. దంతావధానం పూర్తిచేసుకుని, టీ, కాఫీల్లాంటివి తాగేశారు. సరదగా కాసేపు స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడదామని బయటికొచ్చాడా ఇంటి యజమాని. స్విమ్మింగ్ పూల్ లోకి దిగుతుండగా ఓ షాకింగ్ సీన్ కనిపించింది. ఆ స్విమ్మింగ్ పూల్ లో అప్పటికే ఓ ప్రాణి జలకాలాడుతూ ఉంది. దాన్ని చూసి అతడికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఓ పాము ఆ స్విమ్మింగ్ పూల్ లో అటూ ఇటూ తిరుగుతూ ఉండటాన్ని చూసి, దాంట్లోకి దిగకుండా ఆగిపోయాడు. అది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము అని గ్రహించి, వెంటనే అప్రమత్తమయ్యాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం, వాళ్లు వచ్చి దాన్ని పట్టేసి తీసుకుపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది.

    అడిలైడ్ లోని మరైనో ప్రాంతంలో ఓ వ్యాపారవేత్తకు సంబంధించిన ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఒకటి దూరింది. ఎలా వెళ్లిందో కానీ, ఏకంగా స్విమ్మింగ్ పూల్ లోకి చొరబడింది. ఎంచక్కా హాయిగా ఈతకొడుతూ, తన తాపాన్ని తీర్చుకోసాగింది. ఆ ఇంటి యజమాని దీన్ని గ్రహించి వెంటనే స్నేక్ క్యాచర్స్ కు ఫిర్యాదు చేశాడు. వాళ్లు వచ్చి అత్యంత చాకచక్యంగా దీన్ని పట్టుకున్నారు. ఇది అత్యంత విషపూరితమైనదనీ, ఇది ఒక్క కాటు వేస్తే నిమిషంలోనే ప్రాణం పోతుందని వాళ్లు చెప్పడంతో ఆ ఇంటి యజమానికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనయింది. గత మంగళవారం ఈ ఘటన జరగ్గా, స్నేక్ క్యాచర్స్ ఆ వీడియోను తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.





    దాని కింద నెటిజన్లు వెరైటీ వెరైటీ కామెంట్లు పెడుతున్నారు. పాము అయితే మాత్రం అలా ఈత కొట్టాలన్న సరదా ఉండదా ఏంటి? అని కొందరు కామెంట్స్ చేస్తే, మొత్తానికి తన సరదాను ఇలా తీర్చుకుందన్నమాట అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ తరహా సంఘటనలు అడిలైడ్ పరిధిలో జరగడం మామూలేననీ, అటవీ ప్రాంతం దగ్గరగా ఉండటంతో తరచుగా పాములు, మొసళ్లు ఇళ్లల్లోకి కూడా వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటి యజమానులు అప్రమత్తంగానే ఉంటుండటం వల్ల ప్రమాదాలు ఏమీ జరగడం లేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published:January 16, 2021, 17:04 IST

    टॉप स्टोरीज