World Egg Day 2020: ఈ గుడ్డు పేరిట ప్రపంచ రికార్డు.. దీని కథేంటో తెలుసా?

World Egg Day 2020: ఇన్‌స్టాగ్రామ్‌లో world_record_egg పేజీ పోస్ట్ చేసిన గుడ్డు ఫొటోను ఇప్పటి వరకు 5.48 కోట్ల మంది లైక్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

news18-telugu
Updated: October 9, 2020, 8:36 AM IST
World Egg Day 2020: ఈ గుడ్డు పేరిట ప్రపంచ రికార్డు.. దీని కథేంటో తెలుసా?
World Egg Day 2020: ప్రపంచ రికార్డు కొట్టిన ఈ గుడ్డు గుర్తుందా? ఇప్పటికీ సంచలనమే
  • Share this:
World Egg Day 2020 | గుడ్డు మంచి బలవర్థక ఆహారం..! ఎన్నో పోషక విలువలున్న దివ్యమైన ఆహారం..! పేదల నుంచి ధనికుల వరకు.. అందరికీ అందుబాటులో దొరికే ఈ గుడ్డు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శరీరాన్ని పరిపుష్టం చేస్తుంది. అలాంటి ఈ గుడ్డు గత ఏడాది.. సోషల్ మీడియాను ఊపేసి.. ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఆ రికార్డు దీని పేరు మీదే ఉంది. ఇన్‌స్టగ్రామ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన పోస్ట్‌గా రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. world_record_egg పేజీ పోస్ట్ చేసిన గుడ్డు ఫొటోను ఇప్పటి వరకు 5.48 కోట్ల మంది లైక్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

గుడ్డుకు 5 కోట్ల లైకులు వచ్చాయంటే నమ్ముతారా? కానీ నమ్మి తీరాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన పోస్ట్ ఇది. అందులో పెద్దగా ఏమీ లేదు. బ్రౌన్ కలర్లో కేవలం ఓ సాధారణ గుడ్డు ఉంది అంతే. ఆ పోస్ట్‌కు ఇప్పటి వరకు ఐదున్నర కోట్ల లైకులు వచ్చాయి. ఒక పోస్టుకు ఇన్ని లైకులు సాధించడం ఆన్‌లైన్ సెలబ్రిటీలకే సాధ్యం కాలేదు. కానీ ఓ సాధారణ గుడ్డు ఫొటోలకు ఇన్ని లైకులు రావడం సంచలనంగా మారింది. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు వచ్చిన పోస్ట్‌గా రికార్డుల మోత మోగిస్తోంది. ఆ తర్వాతి స్థానంలో XXX Tentacion, Chadwick Boseman పోస్టులు ఉన్నాయి.


ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ఈ గుడ్డు పోస్ట్ పెట్టింది ఎవరో కూడా తెలియదు. world_record_egg యూజర్ నేమ్‌తో గుడ్డు ఫోటో పోస్ట్ చేసి 'ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది లైక్ చేసిన పోస్ట్‌గా అందరం కలసి రికార్డు సృష్టిద్దాం. ప్రస్తుతం కైలీ జెన్నర్(1.8 కోట్లు) పేరు మీద ఉన్న రికార్డు చెరిపేద్దాం' అని గత ఏడాది కామెంట్ పెట్టారంతే. ఇంకేముంది... ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఇలా లైకుల వర్షం కురిపించారు. కైలీ జెన్నర్ రికార్డ్ చెరిపేశారు. ఆ విషయం తెలుసుకున్న కైలీ జెన్నర్ ఏం చేసిందో తెలుసా? సరిగ్గా అలాంటి గుడ్డునే పగలగొట్టేసింది. ఆ పోస్టుకు కూడా కోట్లాది లైక్స్ వచ్చినగ ఈ గుడ్డు పోస్ట్‌కు వచ్చినన్ని లైక్స్ మాత్రం రాలేదు. మొత్తంగా వరల్డ్ రికార్డు కొట్టేసి.. గత ఏడాది ఎన్నో సంచలనాలు సృష్టించింది.
Published by: Shiva Kumar Addula
First published: October 9, 2020, 8:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading