Home /News /trending /

WORLD DAY TO COMBAT DESERTIFICATION AND DROUGHT 2022 THEME HISTORY AND SIGNIFICANCE GH PAH

Combat Desertification Day: నేడు ఎడారీకరణ, కరవు నిర్మూలన దినోత్సవం.. ఈ స్పెషల్ డే చరిత్ర, ప్రాముఖ్యత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఎడారీకరణ, కరవు నిర్మూలన దినోత్సవాన్ని(World Day to Combat Desertification and Drought) నిర్వహిస్తుంటారు. క్షీణించిన భూమిని ఆరోగ్యకరమైన భూమిగా మార్చాలనే ఉద్దేశంతో, ఎడారీకరణను ఎదుర్కోవడానికి సాధ్యమయ్యే పరిష్కారాలను కనుగ

ఇంకా చదవండి ...
ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఎడారీకరణ, కరవు నిర్మూలన దినోత్సవాన్ని(World Day to Combat Desertification and Drought) నిర్వహిస్తుంటారు. క్షీణించిన భూమిని ఆరోగ్యకరమైన భూమిగా మార్చాలనే ఉద్దేశంతో, ఎడారీకరణను ఎదుర్కోవడానికి సాధ్యమయ్యే పరిష్కారాలను కనుగొనేందుకు ఈ ప్రపంచ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. క్రమేణా భూమిపై నిర్మాణాలు పెరుగుతుండటంతో సారవంతమైన నేల శాతం అంతకంతకూ తగ్గిపోతోంది. ఏటా సాగు భూమి విస్తీర్ణం ప్రమాదకర రీతిలో తగ్గిపోతోంది.

ఈ క్రమంలో క్షీణించిన భూమిని పునరుద్ధరించడం అత్యవసరంగా నిపుణులు సూచిస్తున్నారు. ఎడారీకరణను ఎదుర్కొని, భూమిని రక్షించిన రోజునే ఎకనమిక్‌ రెసిలియన్స్‌(Economic Resilience), ఫుడ్‌ సెక్యూరిటీ (Food Security), ఇన్‌కమ్‌ జనరేషన్‌ సాధ్యమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



* ఎడారీకరణ, కరవు నిర్మూలన దినోత్సవం థీమ్
ప్రతి సంవత్సరం ప్రత్యేక థీమ్‌తో నేడు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఎడారీకరణ, కరవు నిర్మూలన దినోత్సవానికి 'రైజింగ్‌ అప్‌ ఫ్రమ్‌ డ్రాట్‌ టుగెదర్‌ (Rising Up From Drought Together)’ అనే థీమ్‌ ఇచ్చారు.

థీమ్‌ను ప్రకటించిన సందర్భంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్(UNCCD), ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, ఇబ్రహీం థియావ్ మాట్లాడుతూ.. ‘కరవులు మానవ, సహజ వ్యవస్థలలో భాగమయ్యాయి. కానీ మనం ఇప్పుడు అనుభవిస్తున్నది చాలా దారుణంగా ఉంది. ఎక్కువగా మానవ కార్యకలాపాల ద్వారా సమస్య పెరుగుతోంది. ఇటీవల సంభవిస్తున్న కరవులు ప్రపంచానికి అనిశ్చిత భవిష్యత్తును సూచిస్తున్నాయి. ఆహారం, నీటి కొరత, అలాగే తీవ్రమైన కరవు కారణంగా సంభవించే వైల్డ్‌ ఫైర్స్‌ ఇటీవల సంవత్సరాలలో తీవ్రమయ్యాయి.’ అని చెప్పారు.

* చరిత్ర
1994లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఎడారీకరణ, కరవు నిర్మూలన దినోత్సవాన్ని ప్రకటించింది. ఎడారీకరణను ఎదుర్కోవడానికి, ముఖ్యంగా తీవ్రమైన కరవును ఎదుర్కొంటున్న ప్రాంతాలలో పరిష్కారాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రపంచ దినోత్సవాన్ని తీసుకొచ్చారు. 1995లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మొదటిసారిగా ఎడారీకరణ, కరవును ఎదుర్కొనే ప్రపంచ దినోత్సవాన్ని పాటించారు.

* ప్రాముఖ్యత
2025 నాటికి 1.8 బిలియన్ల మంది ప్రజలు సంపూర్ణ నీటి కొరత ఉన్న దేశాలు లేదా ప్రాంతాలలో నివసిస్తుంటారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దీనితో పాటు, భూమిలో 2/3 వంతు నీటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఉంటుంది. 2045 నాటికి ఎడారీకరణ వల్ల దాదాపు 135 మిలియన్ల మంది ప్రజలు ఉన్నచోటు నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్తారు.

ఆహారం(Food), ముడి పదార్థాలు, రహదారులు(Roads), గృహాల కోసం పెరుగుతున్న, అంతం లేని డిమాండ్ ఫలితంగా మంచు రహిత భూమిలో మూడు వంతులు కరిగిపోయింది. ఇలాంటి పరిస్థితులను నిర్మూలించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేడు ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Environment, Lands

తదుపరి వార్తలు