‘అనుష్కా... వరల్డ్‌కప్ దగ్గర పడింది... కాస్త విరాట్‌కు చెప్పు’... కత్రీనా ‘కత్తి’ బ్యాటింగ్...

భరత్ సినిమా షూటింగ్‌లో బ్యాటింగ్ చేసిన కత్రీనా కైఫ్... మెలకువలు నేర్పాలని విరాట్‌కు చెప్పాలని అనుష్కను కోరిన కత్రీనా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 22, 2019, 10:07 PM IST
‘అనుష్కా... వరల్డ్‌కప్ దగ్గర పడింది... కాస్త విరాట్‌కు చెప్పు’... కత్రీనా ‘కత్తి’ బ్యాటింగ్...
భరత్ సినిమా షూటింగ్‌లో బ్యాటింగ్ చేసిన కత్రీనా కైఫ్... మెలకువలు నేర్పాలని విరాట్‌కు చెప్పాలని అనుష్కను కోరిన కత్రీనా...
  • Share this:
బాలీవుడ్ హీరోయిన్ కత్తిలాంటి కత్రీనా కైఫ్... ఒకానొక దశలో టాప్ హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ అనుభవించింది. ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న కత్రీనా... ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన ‘భరత్’ అనే సినిమాలో నటిస్తోంది. మాజీ ప్రియుడు, చిరకాల స్నేహితుడు సల్మాన్ ఖాన్‌తో ఈ భామ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడంతో ‘భరత్’పై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా బ్యాట్ పట్టుకుని...తనలోని మరో టాలెంట్ చూపించింది కత్రీనా. ప్రతీ బంతిని బౌండరీని దాటించడమే లక్ష్యంగా బాదింది. ‘భరత్’ మూవీ సెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన కత్రీనా కైఫ్... తన స్నేహితురాలు అనుష్క శర్మకు ఓ స్వీట్ రికమెండేషన్ కూడా పెట్టింది.

‘భరత్ ప్యాకప్ తర్వాత సెట్స్‌లో బ్యాటింగ్... డియర్ అనుష్క శర్మ వరల్డ్ కప్ దగ్గర పడుతోంది. కాస్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ చిన్నమాట చెప్పు. నా స్వింగ్‌లో ఇంఫ్రూట్‌మెంట్ కోసం కొన్ని మెలకువలు నేర్పమను. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నేను అంత పెద్ద బ్యాడ్ ఆల్‌రౌండర్ నేమీ కాదు...’ అంటూ కామెంట్ పెట్టింది కత్రీనా కైఫ్. దీనికి ‘అప్నీ టైమ్ మే అయేగా’ అంటూ తనకూ టైమ్ వస్తుందంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది.

Cricket, Ind vs NZ, Virat Kohli, Anushka Sharma, Viru-anushka, Virushka, Worldcup 2019, ODI Worldcup 2019, katrina Kaif batting, bharat movie salman khan, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, కత్రీనా కైఫ్, వరల్డ్ కప్ 2019
కత్రీనా కైఫ్

సోషల్ మీడియలో కత్రీనా పోస్ట్ చేసిన ఈ వీడియో కొద్దిసమయంలో వైరల్ అయిపోయింది. కత్రీనా బ్యాటింగ్ స్టైల్‌కు ఫిదా అయిన నెటిజన్లు... భారత మహిళా క్రికెట్ టీమ్‌కు ఓ మంచి ఆల్‌రౌండర్ దొరికినట్టుందే! అంటూ పోస్ట్ చేశారు.


First published: January 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading