ప్రపంచవ్యాప్తంగా సూపర్ పింక్ మూన్... అద్భుత దృశ్యాలు

Super Pink Moon : ఆకాశంలో సూపర్ పింక్ మూన్ అద్భుతంగా కనిపిస్తోంది. ఎంతో పెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

news18-telugu
Updated: April 8, 2020, 5:46 AM IST
ప్రపంచవ్యాప్తంగా సూపర్ పింక్ మూన్... అద్భుత దృశ్యాలు
ప్రపంచవ్యాప్తంగా సూపర్ పింక్ మూన్... అద్భుత దృశ్యాలు (credit - twitter - nick harvey)
  • Share this:
Super Pink Moon : సాధారణం కంటే 14 రెట్లు పెద్దగా ఉండే చందమామ (పింక్ మూన్) ఏప్రిల్ 8న ఉదయం 8.05 గంటల నుంచి కనిపించనుంది. ఐతే... ఆ సమయంలో అమెరికాలో చీకటిగా, ఇండియాలో వెలుతురుగా ఉంటుంది. అందువల్ల భారతీయులకు పింక్ మూన్... కాంతి లేకుండా ఓ మేఘంలా మాత్రమే కనిపిస్తుంది. కానీ... ఏప్రిల్ 7 రాత్రి నుంచి చందమామ దాదాపు అదే సైజులో కనిపిస్తోంది. తెల్లారుతున్న కొద్దీ దాని సైజ్ పెరుగుతోంది. కారణం అది భూమికి దగ్గరగా వస్తుండటం వల్లే. సరిగ్గా ఉదయం 8.05కి చందమామ భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది. అదే సూపర్ పింక్ మూన్. అది పింక్ (గులాబీ) రంగులో ఉండదు కానీ... పసుపు రంగులో 30 శాతం ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.

హైదరాబాద్‌లో సూపర్ పింక్ మూన్

గత 20 ఏళ్లలో ఇలాంటివి 79 మాత్రమే వచ్చాయి. ప్రతీ 3 నెలలకూ ఓసారి సూపర్ మూన్ వస్తుంది. ఈ సూపర్ మూన్ ఎందుకొస్తుందంటే... భూమి చుట్టూ చందమామ గుండ్రంగా ఉన్న కక్ష్యలో తిరగట్లేదు. కోడిగుడ్డు ఆకారపు కక్ష్యలో తిరుగుతోంది. అందువల్ల ఇది ఒక్కోసారి భూమికి దగ్గరగా, ఒక్కోసారి దూరంగా వెళ్తుంది. దూరంగా వెళ్లినప్పుడు దాన్ని మైక్రో మూన్ అంటారు. అప్పుడు చందమామ అత్యంత చిన్నగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సూపర్ పింక్‌ మూన్‌ను ఫొటోలు తీసి... ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తమ ప్రాంతంలో పింక్‌మూన్ ఎలా ఉందో చూపిస్తున్నారు.


ఈ సూపర్ మూన్ వల్ల మనకు ఏమీ కాదు. ఎలాంటి అనారోగ్యాలూ రావు. ఏదేదో అవుతుందని ఎవరైనా చెబితే నమ్మవద్దు. ఇక దీన్ని పింక్ మూన్ అనడానికి ఓ కారణం ఉంది. జనరల్‌గా జనవరిలో ఇలా పెద్ద చందమామ వస్తే... దాన్ని తోడేలు చంందమామ (Wolf Moon) అంటారు. ఫిబ్రవరిలో వస్తే... స్నో మూన్, మార్చిలో వస్తే... వార్మ్ మూన్ (Worm Moon) అంటారు. ఏప్రిల్‌లో వస్తే పింక్ మూన్ అంటున్నారు. మేలో వస్తే దీన్ని ఫ్లవర్ మూన్ అనేవారు. అదే జూన్‌లో అయితే స్ట్రాబెర్రీ మూన్, జులైలో బక్ మూన్ (buck moon) అంటారు. ఆగస్టులో వస్తే స్టర్జియన్ మూన్ (Sturgeon Moon), సెప్టెంబర్‌లో కార్న్ మూన్, అక్టోబర్‌లో హంటర్స్ మూన్ (Hunter’s Moon) నవంబర్‌లో బీవర్ మూన్ (Beaver Moon), డిసెంబర్‌లో కోల్డ్ మూన్ (Cold Moon) అని పిలుస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: April 8, 2020, 5:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading