• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • WORLD BEER INDEX 2021 REVEALS THAT GERMANS SPENDING MOST ON BEER ANNUALLY FULL DETAILS HERE MS

Beer: ఆ దేశంలో బీర్లను మంచి నీళ్ల ప్రాయంగా తాగుతున్న ప్రజలు.. యేటా లక్షన్నర రూపాయలు దానికే..

ప్రతీకాత్మక చిత్రం

World Beer Index 2021: ఆ దేశ ప్రజలు బీరు షాపుల ముందు బారులు తీరుతున్నారు. వేయి కాదు.. పదివేలు కాదు.. ఏకంగా  యేటా బీర్ల మీదనే లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి యేటా 411 లీటర్ల బీర్లు తాగుతున్నారంటే అక్కడి ప్రజలు దానిమీద ఎంత మోజు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

  • News18
  • Last Updated :
  • Share this:
    బాధైనా.. దుఖ్ఖమైనా.. సంతోషమేదైనా.. అసలు కార్యక్రమమేదైనా దానిని ఇతరులతో పంచుకోవడానికి మందు ఉండాల్సిందే అంటున్నారు ఆ దేశ ప్రజలు. అందుకే బీరు షాపుల ముందు బారులు తీరుతున్నారు. వేయి కాదు.. పదివేలు కాదు.. ఏకంగా  యేటా బీర్ల మీదనే లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి యేటా 411 లీటర్ల బీర్లు తాగుతున్నారంటే అక్కడి ప్రజలు బీర్లపై ఎంత మోజుపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరు వాళ్లు..? ఏ దేశంలో బీర్లను ఇలా మంచి నీళ్ల ప్రాయంగా తాగుతున్నారు..?

    అసలు విషయానికొస్తే... ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశంలో ప్రజలు బీర్లను ఎక్కువగా తాగుతున్నారు..? దానికోసం ప్రజలు ఎంత ఖర్చు చేస్తున్నారు..? ఇటువంటి విషయాలపై వరల్డ్ బీర్ ఇండెక్స్ 2021 (world beer index 2021) ఇటీవలే ఒక నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా బీర్లు తాగడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్న దేశం జర్మనీ. అవునూ.. ఇక్కడి ప్రజలు బీర్లు తాగడానికి యేటా వెచ్చించే మొత్తం 1907 యూఎస్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో రూ. 1,38,330. అక్కడ బీర్ల రేటు ఎక్కువగా ఉండటం దీనికి ఒక కారణం కాగా.. ప్రజలు కూడా బీర్ ను ఇష్టంగా తాగుతున్నారు. జర్మన్లు యేటా 411 లీటర్ల బీర్లను తాగుతారట.

    దక్షిణాఫ్రికాలో చీప్... ఖతార్ లో పీక్స్..

    ప్రపంచవ్యాప్తంగా బీర్ల రేట్లు దక్షిణాఫ్రికా లో తక్కువగా ఉంటాయట. ఇక్కడ బీర్ రేటు ఒక యూఎస్ డాలర్ మాత్రమేనట. అయితే బీర్ అత్యంత ఖరీదైన అంశంగా ఖతార్ లో ఉంది. ఖతార్ లో ఒక 300 ఎంఎల్ గ్లాస్ బీర్ 11 డాలర్లు (సుమారు రూ. 775) గా ఉంది. ఈ దేశంలో బీర్లపై వంద శాతం టాక్స్ విధించనున్న నేపథ్యంలో రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇదిలాఉండగా.. బీర్ల అత్యధిక వినియోగం చెక్ రిపబ్లిక్ లో ఉంది. ఈ దేశంలో ఒక వ్యక్తి సగటున 468 బీర్లు తాగుతాడట.

    ఈ జాబితా ప్రకారం భారత్ లో ఒక బీరు ధర మూడు డాలర్లుగా ఉంది. ఇక భారత్ లో యేటా సగటున బీర్ తాగడానికి వెచ్చించే ఖర్చు భారీగానే (రూ.7,036) ఉంది. వివిధ దేశాల్లో ప్రజలు బీర్ల కోసం ఖర్చు చేస్తున్నది ఎంత..? ఏ దేశంలో బీర్ల రేట్లు ఎలా ఉన్నాయనేదానికి సంబంధించి పూర్తి నివేదిక world beer index 2021 ఇక్కడ ఉంది.

    ఎక్కువ ఖర్చు పెడుతుంది కరోనాకే..

    ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా గురించి అందరికీ తెలుసు. కానీ అదే పేరుతో బీర్ కూడా ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. ప్రపంచంలో ఎక్కువ కాస్ట్ ఉన్న బీర్ ఇదేనట. కరోనా తో పాటు హీనెకెన్ కూడా అత్యంత ఖరీదైన బీర్లుగా గుర్తించబడ్డాయి.
    Published by:Srinivas Munigala
    First published: