కరోనా (Corona) తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ముఖ్యమైంది వర్క్ ఫ్రం హోం (Work From Home) కల్చర్. కరోనాకు ముందు వర్క్ ఫ్రం హోం. కరోనా సమయంలో చాలా కంపెనీలు రిమోట్ వర్కింగ్ (Remote Working) అవకాశాన్ని కల్పించాయి. కరోనా ఉధృతి తగ్గడంతో 2022 జనవరి నుంచి కార్యాలయాలు తెరిచేందుకు సిద్ధమవుతుండగా.. ఒమిక్రాన్ తో మళ్లీ కథ మొదటికొచ్చింది. వచ్చే కొత్త సంవత్సరంలోనూ (2022) పలు కంపెనీలు తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ను కల్పించాయి. మళ్లీ ఉద్యోగులు ఎవరూ ఆఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని వర్క్ ఫ్రం హోంను పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి.
ఫేస్బుక్ (Face Book)
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించింది. డిసెంబర్లో సోషల్ మీడియా టెక్ కంపెనీ తన యూఎస్‌లో తన కార్యాలయాలను జనవరి 31, 2022 నుంచి పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఒమిక్రాన్ కేసులు పెరగడంతో వర్క్ ఫ్రంహోం పొడగిస్తున్నట్టు తెలిపింది.
ట్విట్టర్ (Twitter)
ఫేస్‌బుక్‌తో పోటీ పడే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా కరోనా కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని ఇచ్చింది. తిరిగి కార్యాలయాలు తెరవాలని భావించినా.. కరోనా (Corona) కారణంగా మళ్లీ నిర్ణయాన్ని వాయిదా వేసుకొంది.
మైక్రోసాఫ్ట్ (Microsoft)
ప్రముఖ సాప్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఇచ్చింది. కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో హైబ్రిడ్ వర్క్ మాన్యువల్‌ను తయారు చేసింది. కానీ కరోనా కారణంగా మళ్లీ వర్క్ ఫ్రం అవకాశాన్ని ఇచ్చింది.
షాపీఫై (Shopify)
ఇండియాలో పాపుల్ అవుతున్న షాపీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ను కల్పించింది. ఇప్పుడు కంపెనీ వర్క్ ఫ్రం హోమ్‌ను శాశ్వతంగా మార్చేందుకు నిర్ణయించింది.
Work From Home: ఆఫీసుకు రావాలనుకోవడం లేదు.. "వర్క్ ఫ్రం హోం"కు అలవాటు పడ్డ ఉద్యోగులు
ఇవే కాకుండా టాటా స్టీల్, స్పాటిఫై సంస్థలు వర్క్ ఫ్రం ఆప్షన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. చాలా కంపెనీలు తమ హైబ్రీడ్ వర్క్ విధానాన్ని నిలిపి వేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.
కరోనా (Corona) తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ముఖ్యమైంది వర్క్ ఫ్రం హోం కల్చర్. కరోనాకు ముందు వర్క్ ఫ్రం హోం. కరోనా సమయంలో చాలా కంపెనీలు రిమోట్ వర్కింగ్ (Remote Working) అవకాశాన్ని కల్పించాయి. ఇప్పుడు తిరిగీ కంపెనీలకు రావడానికి చాలా మంది ఉద్యోగులు ఆసక్తి కనబర్చడం లేదు. గతంలో యజమాని ఉద్యోగిపై పూర్తి హక్కును కలిగి ఉండేవాడని, ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం (Work From Home) కారణంగా ఉద్యోగికి తన పని వాతావరణాన్ని నియంత్రించుకొనే అవకాశం లభించిందని మెర్సెర్ మెట్ల్ (Mercer Mettl) సీఈఓ సిద్ధార్థ గుప్త అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Microsoft, Twitter, Work From Home