news18
Updated: November 23, 2020, 9:34 PM IST
ఒళ్లంతా పచ్చబొట్లతో జులియా..
- News18
- Last Updated:
November 23, 2020, 9:34 PM IST
పచ్చబొట్టు.. శరీరంలో ఏదో ఒక భాగంలోనో, మరీ ఎక్కువైతే రెండు మూడు చో ట్లలోనో పొడిపించుకునే ఒక సరదా. గత కొంత కాలంగా యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. పచ్చబొట్టు మీద ఉన్న మోజుతో సెలబ్రిటీలు సైతం వాటిని వేయించుకుంటున్నారు. ఇక హీరోయిన్లు అయితే.. యదల మీద, వీపు భాగంలోనో.. కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా ఉండే భాగాల్లోనో టాటూస్ వేసుకుని హాట్ హాట్ ఫోజులిస్తారు. ఈ కోవలో తెలుగు అగ్రశ్రేణి హీరోయిన్లు త్రిషా, శ్రుతి హాసన్ నుంచి మొదలుకుని బుల్లితెర మీద అందాలు ఆరబోసే అనసూయ వరకు అదే దారి. కానీ ఇక్కడో ఒక మహిళ తన శరీరంలో ఖాళీ అనేదే లేకుండా పచ్చబొట్లను వేయించుకుంది.
వివరాల్లోకెళ్తే... అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జులియా నానోకు చిన్నప్పట్నుంచే టాటూలంటే పిచ్చి. తనకు 18 ఏటనే ఆమె తొలి పచ్చబొట్టు పొడిపించుకున్నారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఆమె ఈ టాటూలను వేయించుకుంటున్నారు. ప్రస్తుతం 32 ఏళ్లున్న జులియాకు ఇప్పుడు ఒళ్లంతా పచ్చబొట్లే.. ఆమె శరీరం మీద ముఖం తప్ప ఇసుమంతైనా ఖాళీ లేదు. ఆఖరికి జననేంద్రియాల మీద కూడా ఆమె టాటూలు వేయించుకుంది.
ఇప్పటివరకు టాటూల మీద రూ. 19 లక్షలు ఖర్చు చేశానని జులియా చెప్పుకొచ్చింది. 18 ఏళ్ల వయసులో తొలిసారి తన ఛాతి మీద రాగి పువ్వు ఆకారంలో టాటూ వేయించుకున్నానని జులియా తెలిపింది. ఇలా ఒక్కొక్క పార్ట్.. శరీరం మొత్తం టాటూస్ వేయించుకున్నానని వివరించింది. తన ప్రైవేట్ పార్ట్స్ పై టాటూస్ వేయించుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు తనను తిట్టారని.. అయినా తాను మాత్రం ఆ కామెంట్లను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. ఇటీవల శరీరం మొత్తం మీద పచ్చబొట్లు పొడిపించుకోగా.. ఇక ఖాళీ లేదని.. తల మీద ఉన్న జుట్టును కూడా కత్తిరించుకుని.. అక్కడ కూడా టాటూ వేయించుకున్నానని ఆమె వివరించింది. ఇందుకు సంబంధించిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
గత మూడేళ్లలో తన శరీరంపై టాటూలు వేయడానికి 234 గంటలు పట్టిందని జులియా తెలిపింది. టాటూలు వేసుకోవడమంటే తనకు మహా సరదా అని.. దానికి ఎవరు అభ్యంతరం చెప్పినా తాను పట్టించుకోనని కరాఖండీగా చెప్పిందీ మహిళ. ఆఫీసులో తనను చూసి అందరూ ప్రోత్సహిస్తున్నారని.. టాటూల వల్ల తన జీవితంలో వచ్చిన పెద్ద మార్పులేమీ లేవని ఆమె తెలిపింది. ఈ ఏడాది పూర్తయ్యేసరికి తన ముఖాన్ని కూడా టాటూతో నింపేయాలనే ఆశతో ఉన్నట్టు జులియా తెలిపింది.
Published by:
Srinivas Munigala
First published:
November 23, 2020, 9:34 PM IST