హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఎమ్మెల్యేకు బురదతో స్నానం చేయించిన మహిళలు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

ఎమ్మెల్యేకు బురదతో స్నానం చేయించిన మహిళలు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

ఎమ్మెల్యేకు బురదతో స్నానం

ఎమ్మెల్యేకు బురదతో స్నానం

Uttar pradesh: తమ నియోజక వర్గంలోని ప్రజలను కలవడానికి స్థానిక ఎమ్మెల్యే వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడి మహిళలు.. తమ నేతతో.. బురద స్నానం చేయించారు.

కొన్ని చోట్ల ఆకాశానికి రంధ్రం పడిందా అన్నట్లు వర్షం పడుతుంది. మరికొన్ని చోట్ల దీనికి భిన్నంగా అసలు వర్షం కురవట్లేదు. అయితే, వర్షాలు కురవడానికి ఆయాప్రాంతాలలో భిన్నమైన ఆచారాలు పాటిస్తుంటారు. కొందరు కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. ఆ తర్వాత.. ఊరంతా తిప్పుతారు. మరికొందరు.. దేవాలయాలను నీటితో నింపేస్తుంటారు. ఇలా స్థానికంగా ఉన్న ఆచారాలను పాటిస్తుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. స్థానికంగా పిప్పర్ డ్యూరా లోని మహా రాజ్ గంజ్ లోని ప్రజలు.. పంటలు చక్కగా పండటానికి, వర్షాలు బాగా కురవడానికి వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. ఈ క్రమంలో.. అక్కడి ప్రజలు.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జై మంగల్ కనోజియాకు బురదతో స్నానం చేయించారు. అక్కడి ప్రజలు.. తమ నియోజక వర్గం నేత.. బురదలో స్నానంచేస్తే.. ఇంద్రుడు సంతోషిస్తాడని వారు భావిస్తారు.


అందుకే.. అక్కడి ప్రజలు తమ నియోజక వర్గానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే జై మంగల్ కనోజియాపై బురద స్నానం చేయించారు. దీన్ని అక్కడి ప్రజలు.. కాల్ కలూటీ అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం కొందరు మహిళలు ఎమ్మెల్యేకు బురదతో స్నానం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (viral video)  మారింది.

ఇదిలా ఉండగా ఒక తల్లి తన దత్తత కూతురి పట్ల దారుణం ప్రవర్తించింది.

ఉత్తర ప్రదేశ్ లో  (Uttar pradesh) దారుణమైన ఘటన జరిగింది. లక్నోలో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న ఠాకూర్ గంజ్ లోని 35 ఏళ్ల పూనమ్ కు పిల్లలు లేరు. దీంతో వీరు.. అజయ్ కుమార్ కూతురును ఆరునెలల క్రితం దత్తత తీసుకున్నారు. అయితే, వీరు మనస్పూర్తిగా బాలికను ఇష్టంతో దత్తత తీసుకొలేదు. బాలిక ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెను వేధించేవారు. ఆమె మారు తండ్రి లైంగికంగా కూడా హింసించేవాడు

ఈక్రమంలో.. బాలిక దత్తత తల్లి ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించింది. కిచెన్ లోని సల సల కాగుతున్న వేడి నూనెను బాలిక ప్రైవేటు భాగాల్లో పోసింది. దీంతో బాలిక.. తన కన్న తండ్రికి జరిగిన దారుణాన్ని తెలిపింది. దీంతో బాలికను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాలికకు చికిత్స అందిస్తున్నారు. బాలిక కన్న తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూనమ్ ను అరెస్టు చేశారు. విచారణ చేపట్టారు.

First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు