మా అమ్మకు అందమైన భర్త కావాలి... వైరల్‌గా మారిన కూతురి ట్వీట్

తన తల్లికి పెళ్లి చేసేందుకు మంచి వరుడును చూస్తున్నానంటూ లా చదువుతన్న ఆస్తా వర్మ అనే ఓ విద్యార్ధి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: November 4, 2019, 3:15 PM IST
మా అమ్మకు అందమైన భర్త కావాలి... వైరల్‌గా మారిన కూతురి ట్వీట్
మా అమ్మకు అందమైన భర్త కావాలి... వైరల్‌గా మారిన కూతురి ట్వీట్
  • Share this:
సాధారణంగా తల్లిదండ్రులు.. తమ పిల్లలు పెళ్లీడుకు రాగానే.. మంచి సంబంధాలు కోసం వెతుకుతుంటారు. అప్పట్లో తెలిసినవారికి చెబుతూ సంబంధాలు చూడమనేవారు. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు అన్నీ ఆన్ లైన్లోనే జరిగిపోతున్నాయి. ఇక పెళ్లి సంబంధాల కోసం కూడా అనేక మ్యాట్రీమనీ సైట్స్ కూడా వేలల్లో తెరపైకి వచ్చాయి. కొందరైతే తమ సోషల్ మీడియా పేజీల్లోనే పెళ్లి సంబంధాలు వెతికేసుకుంటున్నారు. అయితే రోటీన్‌కు భిన్నంగా ఓ అమ్మాయి తన తల్లి కోసం మంచి వరుడు కావాలంటూ... ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘ 50ఏళ్ల వయసుపైబడిన హ్యాండ్‌సమ్ వ్యక్తి, ప్యూర్ వెజిటేరియన్, మద్యం తాగనివాడు, ఆర్థికంగా స్థిరపడినవాడు’ తన తల్లి కోసం చూస్తున్నానని కూతురు ట్వీట్ చేసింది. తన తల్లికి పెళ్లి చేసేందుకు మంచి వరుడును చూస్తున్నానంటూ లా చదువుతన్న ఆస్తా వర్మ అనే విద్యార్ధి ఈ ట్వీట్ చేసింది.

దీంతో ఆస్తా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది ఆస్తా చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. తన తల్లి కోసం మంచి తోడును వెతుకుతున్న గొప్ప కూతురంటూ కితాబిస్తున్నారు. మరికొందరు... మేం కూడా మా వంతు సాయం చేస్తూ మంచి వరుడ్ని వెతుకుతామంటూ రిప్లై ఇస్తున్నారు. ఇంకొందరు వినేందుకు చాలా కొత్తగా అనిపిస్తున్న... మంచి పని చేస్తున్నావంటూ.. అస్తాకు మద్దతిస్తున్నారు. అయితే అస్తా చేసిన ట్వీట్‌తో పాటు తన తల్లితో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. దీంతో 50ఏళ్లు పైబడి తమ మిగిలిన జీవితం ఆనందంగా గడపాలనుకున్నవారు.. ఇప్పుడు అస్తా తల్లితో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి చూడాలి ఆస్తా తన తల్లికి తాను అనుకున్న వరుడ్ని తీసుకురాగలదో లేదో.







First published: November 4, 2019, 3:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading