అమెరికాకు (America) చెందిన అమ్మాయి తన నాలుకకు శస్త్రచికిత్స చేయించుకుంది. ఈ క్రమంలో ఆమె నాలుక రెండుగా విడగొట్టబడ్డాయి. ఆమె ఒకేసారి రెండు వెర్వేరు టెస్ట్ లను చూడగలదు. అదే విధంగా, అవి ఏవిధంగా ఉందో కూడా చెప్పగలదు. సోషల్ మీడియాలో వేల వీడియోలు వైరల్ (Video viral) అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. ఇక్కడ ఒక అమ్మాయి చేస్తున్న వింత పనితో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. కాలిఫోర్నియాకు (California) చెందిన బ్రియాన్ మేరీ షిహదేవ్ తన నాలుకకు ఆపరేషన్ చేయించుకుంది. దీంతో నాలుక రెండుగా చీలిపోయింది. ఈ క్రమంలో అమ్మాయి ఒకే సమయలో రెండు వెర్వెరు టెస్ట్ లను చూడగలదు. వాటి రుచిని పసిగట్టగలదు. ప్రస్తుతం ఆమె గ్లాస్ లో డ్రింక్ ను తీసుకొని ఒకే సమయంలో రెండు నాలుకలతో టెస్ట్ లు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో ప్రతి రోజు వేలల్లో వీడియోలు (Social media) వైరల్ అవుతుంటాయి.
వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. జంతువులకు చెందిన అనేక వీడియోలు వైరల్ (Viral videos) అవుతున్నాయి. కొన్ని రకాల వెరైటీ వీడియోలను చూడటానికి నెటిజన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
పూర్తి వివరాలు... ఒక గదిలో తేళ్లు కుప్పలుగా పడిఉన్నాయి. అవి ఒకదాని మీద మరోకటి పాకుతున్నాయి. అవి ఎర్రగా ఉన్నాయి. ఇలాంటి తేళ్లు (Scorpions) బ్రెజిల్ లో ఎక్కువగా కన్పిస్తాయని నెటిజన్ లు కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా తేళ్లు.. సంభోగం జరపవు. ఇవి లైంగిక చర్య జరపకుండా పిల్లలను కనగలవు. ఈ విధంగా తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో సుమారు.. 2000ల వరకు తేళ్ల జాతులు ఉన్నట్లు అంచనా.
వీటిలో కేవలం 30 నుంచి 40 జాతులు మాత్రమే అత్యంత భయంకరమైనవిగా తెలుస్తుంది. మిగతా తేళ్ళు కుడితే ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కల్గదు. అయితే, ప్రపంచంలో డెత్ స్టాకర్ స్కార్పియన్ అత్యంత విషపూరితమైనదిగా భావిస్తారు. దీని తోకల అత్యంత విషం ఉంటుంది. ఇది కాటు వేస్తే.. నిముషాల్లో మనిషి మరణిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.