హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: TikTok యూజర్ వైరల్ వీడియో.. హెయిర్ స్ప్రే అయిందని జుట్టుకు జిగురు రాస్తే జరిగేది ఇదే..

Viral Video: TikTok యూజర్ వైరల్ వీడియో.. హెయిర్ స్ప్రే అయిందని జుట్టుకు జిగురు రాస్తే జరిగేది ఇదే..

Image-Twitter

Image-Twitter

మేకప్ వస్తువుల విషయంలో ప్రత్యామ్నాయాల కోసం అతిగా ప్రయత్నిస్తే ఇలాంటివే జరుగుతాయి.

హెయిర్ స్ప్రే అయిపోతే ఊరుకోవాలి కానీ ఈమెలా మాత్రం మీరు ప్రయోగం చేసి ఆసుపత్రి పాలు కాకండి. లూసియానాలోని టెస్సికా బ్రౌన్ అనే టిక్ టాక్ యూజర్ హెయిర్ స్ప్రే అయిపోయిందని తన జుట్టుపై గొరిల్లా స్ప్రేను నిర్భయంగా, సగర్వంగా అప్లై చేసింది. అంతటితో ఊరుకోలేదు.. ఈమొత్తం వ్యవహారాన్ని తన వీడియోల ద్వారా వివరిస్తూ.. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ సైతం చేసింది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయి అందరికీ షాక్ ఇచ్చింది. TikTok, Twitterలో ఇది చాలా వ్యూస్ సంపాదించేసింది. "ఇలా చింపిరిగా జుట్టు ఉండటం ఏం బాలేదు.. పైపెచ్చు నా హెయిర్ స్ప్రే అయిపోయింది.. అందుకే నేను ఇలా గ్లూ ఉపయోగిస్తున్నా”.. అంటూ వీడియోలో మాట్లాడుతూనే గొరిల్లా గ్లూను శుభ్రంగా తలకు నూనెలా రాసేసుకుంది. అంతే వెంటనే ఆమె జుట్టు తలకు పూర్తిగా అతుక్కుపోయింది. ఇక ఆతరువాత 15సార్లు తలస్నానం చేసినా జుట్టుపై ఉన్న జిగురు పోలేదని ఆమె వాపోయింది. మూడు రోజులు ఆమె నానాప్రయత్నాలు చేసినా జుట్టు నుంచి కొంచెం కూడా బంక పోలేదు. దీంతో చేసేది లేక భయంతో వణికిపోయి ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేరిపోయింది. ఇక తాను ఎమర్జెన్సీ వార్డులో చేరిన విషయాన్ని ఫొటోలతోసహా ఆమె ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయటంతో అసలు విషయం బయటపడింది.

అత్యంత ప్రమాదకరం..

ఆమె తలను షేవ్ చేయాలని, భవిష్యత్తులో జుట్టు పెరుగుతుందో లేదో కూడా తెలియదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆల్కహాల్ తో పదేపదే కడిగి చూడమని గొరిల్లా గ్లూ కంపెనీ సూచించింది. అయితే నెలరోజుల పాటు ఈ గ్లూను ఏమాత్రం కదిలించలేమని కూడా చెబుతున్నారు. అయితే తలకు, జుట్టుకు ఇది చాలా హానికరం కాబట్టి భవిష్యత్తులో దీని పర్యవసానాలు ఎంత భయంకరంగా అయినా, ప్రమాదకరంగా అయినా ఉండచ్చని వైద్యులు ఆమెను ఇప్పటికే హెచ్చరించారు.

ఏమిటీ గొరిల్లా గ్లూ?

గొరిల్లా గ్లూని మెటల్, స్టోన్స్, చెక్క, సెరామిక్స్, ఫోమ్, గ్లాస్ వంటి బలమైన వాటిని అతింకించేందుకు ఉపయోగిస్తారు. ఫర్నీచర్ వంటి పలు వస్తువుల రిపేర్‌లలో దీన్ని ఉపయోగిస్తే బ్రహ్మాండంగా అది విరిగిన వస్తువులను అతికిస్తుంది. ప్రపంచంలోనే ఇది అత్యంత సమర్థవంతమైన జిగురుగా పేరుగాంచింది. ఏ జిగురుతో అతుక్కోకపోయినా గొరిల్లా జిగురు ప్రయోగిస్తే చాలు అవి బ్రహ్మాండంగా అతుక్కుంటాయి. ఇది వాటర్ ప్రూఫ్, టెంపరేచర్ రెసిస్టంట్, అంతేకాదు ఇది పూస్తే అస్సలు బంక కనిపించకుండా ఉండే ఇన్విజబుల్ గ్లూగా పేరుగాంచింది. ఇది మనుషులపై ప్రయోగించరాదని దీనిపై హెచ్చరికలు కూడా ముద్రిస్తారు. చాలా హానికరమైన కెమికల్స్ తో తయారైన గొరిల్లా గ్లూ మీ ఇంట్లో ఉంటే దాన్ని పిల్లల కంట పడకుండా, పిల్లల చేతికి దొరక్కుండా చూసుకోండి.

First published:

Tags: Tiktok, Viral Video

ఉత్తమ కథలు