బీహార్(Bihar)లో ఓ ప్రేమ జంట స్టోరీ ఇప్పుడు అందర్ని ముక్కున వేలు వేసుకునేలా చేస్తోంది. సమస్తీపూర్(Samastipur)జిల్లాలో ఓ వదిన తన మరదలిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆమెకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఉండగానే భర్త సోదరితో ప్రేమలో పడి పంచాయితీని పోలీస్ స్టేషన్(Police station)వరకు తీసుకెళ్లింది. శుక్లాదేవీ(Shukla Devi) అనే వివాహిత 2013లో ప్రమోద్ దాస్(Pramod Das)అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సవ్యంగా సాగుతున్న వీరి ఇంట్లో అడుగుపెట్టింది ప్రమోద్ సోదరి సోనిదేవీ(Sonidevi). రావడమే కాదు అన్న భార్యను ప్రేమించి చివరకు వాళ్ల కాపురంలోనే నిప్పులు పోసింది.
ఇద్దరు ఆడవాళ్ల మధ్య లవ్ స్టోరీ ..
సమస్తీపూర్ జిల్లా ధరహారా గ్రామానికి చెందిన ప్రమోద్ దాస్, శుక్లాదేవీ భార్యభర్తలు. పదేళ్ల క్రితమే వీరిద్దరికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రమోద్ సోదరి సోనీదేవి తన అన్న ఇంట్లో ఉండేందుకు ఆరు నెలల క్రితం వచ్చింది. ఈక్రమంలో శుక్లాదేవీ భర్త ప్రమోద్‌ని కాదని మరదలితో ప్రేమలో పడింది. ఆమెతో కలిసి జీవించేందుకు భర్తను వదులుకొని సోనీదేవితో కలిసి జీవిస్తోంది. జీవించడమే కాదు..తాను మగవాడిలా కట్టుబొట్టు పూర్తిగా మార్చేసింది. జడ కత్తిరించుకొని క్రాఫ్ చేయించుకొని..షర్ట్‌లు,ప్యాంట్‌లు వేసుకుంటోంది. అంతే కాదు తన పేరును సూరజ్ కుమార్‌గా మార్చుకుంది. తన భార్య సోదరిని ప్రేమించిందని..పెళ్లి చేసుకోవడాన్ని శుక్లాదేవీ భర్త ప్రమోద్ అంగీకరించాడు. దాంతో అతని ముందే తన మరదలితో కాపురం చేస్తోంది శుక్లాదేవీ. ఈక్రమంలోనే వీరి వ్యవహారం స్థానికులకు తెలిసిపోయింది.
భర్తను వదిలి మరదలితో పెళ్లి..
అంతే ప్రమోద్ పెద్ద సోదరి ఉషాదేవీకి సమాచారం అందజేశారు. ఒక మహిళ మరో మహిళను వివాహం చేసుకోవడం ఏమిటని ఇంటి కొచ్చి నిలదీసింది. తన సోదరుడి చివాట్లు పెట్టి సోనీదేవిని బలవంతంగా తన వెంట తీసుకెళ్లింది. ఈ వెరైటీ లవ్ స్టోరీ అంతటితో ఆగలేదు. శుక్లాదేవీ ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన వదిన ఇంటిపై దాడి చేసి తన భార్య సోనీదేవిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని ఫిర్యాదు చేసింది. శుక్లాదేవీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వార్త నెట్టింట్లో వెరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వార్త ..
మహిళను మరో స్త్రీ వివాహం చేసుకోవడమే కాదు..ఆమెను తనతో కాపురానికి పంపమని ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే శుక్లాదేవీ తన మరదల్ని కిడ్నాప్ చేశారని ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ..దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Love story, VIRAL NEWS