హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video : మామూలుగా లేదుగా..బీచ్ లో బికినీ భామల మధ్య చీరకట్టులో మహిళ

Video : మామూలుగా లేదుగా..బీచ్ లో బికినీ భామల మధ్య చీరకట్టులో మహిళ

బికినీల నడుమ చీరకట్టులో మహిళ

బికినీల నడుమ చీరకట్టులో మహిళ

Woman wearing saree on beach : రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలని అంటుంటారు. అంటే దాని అర్థం ఉన్న మనం ఉన్న ప్రదేశానికి అనుగుణంగా ఉండాలని. వెళ్ళే ప్రదేశానికి అనుగుణంగా వేషధారణ ఉండటంతో పాటు మన చర్యలు కూడా ఉండాలనే దాని అర్థం. పార్టీకి వెళ్లేటప్పుడు పార్టీ వేర్,ఆఫీసులో ఫార్మల్, పండుగలకు ట్రెడిషనల్,బీచ్‌(Beach)కి వెళ్లేటప్పుడు ఈత దుస్తులు ధరిస్తే బాగుంటది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Woman wearing saree on beach : రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలని అంటుంటారు. అంటే దాని అర్థం ఉన్న మనం ఉన్న ప్రదేశానికి అనుగుణంగా ఉండాలని. వెళ్ళే ప్రదేశానికి అనుగుణంగా వేషధారణ ఉండటంతో పాటు మన చర్యలు కూడా ఉండాలనే దాని అర్థం. పార్టీకి వెళ్లేటప్పుడు పార్టీ వేర్,ఆఫీసులో ఫార్మల్, పండుగలకు ట్రెడిషనల్,బీచ్‌(Beach)కి వెళ్లేటప్పుడు ఈత దుస్తులు ధరిస్తే బాగుంటది. అయితే బీచ్ లొ ఈత దుస్తులను అంటే స్విమ్‌సూట్‌ను ధరించే విషయంలో చాలా మంది సంకోచించడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా భారతదేశంలో బికినీ ధరించడం ఇప్పటికీ మహిళలకు ఆశ్చర్యంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా కొంతమంది భారతీయ మహిళలు విదేశాల్లోని బీచ్ కు వెళ్లినప్పుడు భారతీయ సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తారు. అయితే తాజాగా వైరల్ అవుతున్ ఓ వీడియోలో ఫారిన్ లోని ఓ బీచ్ లో బికినీ(Bikini) ధరించిన స్త్రీల మధ్య... ఒక మహిళ చీర(Saree) కట్టుకుని బీచ్‌లో నడుస్తూ కనిపించింది. ట్విట్టర్ యూజర్ రిషికా గుర్జార్ ఇటీవల చాలా ఫన్నీగా కనిపించే ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. "హే ఆంటీ, మీరు ఎక్కడికి చేరుకున్నారు?"అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేయగా అది ఇప్పుడు విపరీతంగా వైరల్(Viral Video) అవుతుంది.

బీచ్‌లో చీర కట్టుకున్న మహిళ 

మనం మాట్లాడుకుంటున్న వీడియోలో మహిళ పూర్తిగా ఇండియన్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తుంది. ఆమె ఎర్రటి చీర కట్టుకుని తలపై ముసుగు వేసుకుని ఉంది. ఆమె సముద్రం వైపు నుండి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె చుట్టూ బికినీ ధరించిన స్త్రీలు కనిపిస్తారు. ఆ స్త్రీని ఇలా చూసి మిగతా ఆడవాళ్ళు కూడా కాస్త ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ మహిళ కెమెరా వైపు చూస్తూ నవ్వుతోంది. ఆమె కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు, ఆమె వెనుక ఉన్న దృశ్యం చూస్తే అక్కడ చాలామంది స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారు. సాధారణంగా భారతీయ మహిళలు అలాంటి ప్రదేశానికి వెళ్లినప్పుడు, వారు తమ కుటుంబంలోని ఆచారాలను దృష్టిలో ఉంచుకుని, అలాంటి దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు.

Viral Video : బరితెగించిన మహిళ..అలా చూపిస్తూ సెక్యూరిటీ గార్డుపై దాడి


ఈ వీడియోపై నెటిజన్ల స్పందన

చాలా మంది నెటిజన్లు మహిళపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమేజింగ్, స్టైల్ డిఫరెంట్ గా కనిపిస్తోందని,స్త్రీ సంస్కారవంతురాలు అని,మహిళ దుస్తులను చూస్తే ఆమె రాజస్థానీ అని అనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో, ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మీ సంస్కృతిని మరచిపోకండి అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bikini, Viral Video, WOMAN

ఉత్తమ కథలు