హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

లక్షాధికారిని చేసే లాటరీ టిక్కెట్ ని పర్సులో పెట్టుకొని మర్చిపోయిన మహిళ..చివరికి ఏమైందంటే

లక్షాధికారిని చేసే లాటరీ టిక్కెట్ ని పర్సులో పెట్టుకొని మర్చిపోయిన మహిళ..చివరికి ఏమైందంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Woman Has Ticket of 41 Lakh but  No Idea : ఎవరి భవితవ్యం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఎవరిని ఎప్పుడు ఏ రకంగా అదృష్టం వరిస్తుందో ఎవరికీ తెలియదు. మన దగ్గర ఉన్న విలువైన వస్తువు గురించి మనకు తెలియకపోవడం చాలా సార్లు జరుగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Woman Has Ticket of 41 Lakh but  No Idea : ఎవరి భవితవ్యం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఎవరిని ఎప్పుడు ఏ రకంగా అదృష్టం వరిస్తుందో ఎవరికీ తెలియదు. మన దగ్గర ఉన్న విలువైన వస్తువు గురించి మనకు తెలియకపోవడం చాలా సార్లు జరుగుతుంది. అదృష్టం మనతో పాటు నడుస్తోందని కూడా మనం గుర్తించలేని స్థితిలో ఉండి దానిని మరెక్కడో వెతుకుతూ ఉంటాము. 41 లక్షల లాటరీని నెలల తరబడి ఊహించలేకపోయిన ఒక అమెరికన్ మహిళ(USA Woman) విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అమెరికాలోని మిస్సోరీకి చెందిన ఓ మహిళ తన పర్సులో 41 లక్షల రూపాయలను పెట్టుకుని.. నెలల తరబడి కూడా ఆ విషయం తెలియక తన అదృష్టాన్ని పట్టించుకోకుండా తిరుగుతూనే ఉంది.

మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌కు చెందిన మహిళ..మాంచెస్టర్ స్టోర్‌లో జూలై 16న లాటరీ టిక్కెట్‌(Lottery Ticket)ను కొనుగోలు చేసి తన బ్యాగ్‌ లో పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె దానిని మరచిపోయి దుకాణానికి వెళ్లలేదు. నెలల తర్వాత, ఆమె ఒక దుకాణానికి చేరుకున్నప్పుడు ఆమెకు తన టిక్కెట్ గురించి గుర్తుకు వచ్చింది. చివరకు ఆ లాటరీ టిక్కెట్ ను గుర్తించింది. అయితే లాటరీ ఫలితాలు అప్పటికే ప్రకటించగా ఆమె దగ్గర ఉన్న లాటరీ టిక్కెట్ కు భారతీయ కరెన్సీలో 41 లక్షల 23 వేల రూపాయలు తగిలింది. దీంతో వెంటనే వెళ్లి తనకు లాటరీలో వచ్చిన డబ్బులు కలెక్ట్ చేసుకొంది. తన విజయం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసింది ఆ మహిళ.

Lottery : నీ అదృష్టం మాములుది కాదు భయ్యో..ఆటో డ్రైవర్ కి లాటరీలో రూ.25 కోట్లు

మరోవైపు,కష్టపడి ఏ రోజు వచ్చిన డబ్బులతో ఆ రోజు పొట్ట నింపుకునే యువకుడికి అదృష్టం కొద్ది లాటరీ(Lottery)లో రూ. 21 కోట్లు రావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఆ యువకుడి పేరు భరత్. నేపాల్(Nepal) కు చెందిన భరత్(Bharat) బతుకుదెరువు కోసం స్వదేశాన్ని వదిలి దుబాయ్(dubai) లో కారు క్లీనర్(Car Washer) గా పనిచేసేవాడు. భరత్ గత 3 సంవత్సరాలుగా కార్ వాషర్ గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి నేపాల్ లో రిక్షా నడుపుతుంటాడు. భరత్ ఇటీవల తన స్నేహితులతో కలిసి దుబాయ్ లో మెహజూజ్ డ్రా లాటరీని కొనుగోలు చేశాడు. లాటరీ ఫలితాలు ప్రకటించిన తర్వాత భరత్ ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. తాను కొనుగోలు చేసిన టిక్కెట్ కి మొదటి బహుమతిగా రూ.21 కోట్లు రావడంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. రాత్రికి రాత్రే తన అదృష్టం మారిపోతుందని, కార్ క్లీనర్ నుంచి కోటీశ్వరుడు అవుతానని కలలో కూడా ఊహించలేదని అంటున్నాడు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Lottery, USA

ఉత్తమ కథలు