Woman stunt failure video : సోషల్ మీడియా(Social media) ద్వారా వీలైనంత త్వరగా పాపులర్ కావడానికి కొందరు రకరకాల విన్యాసాలు,విచిత్రాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చిన్న అజాగ్రత్త తమను ఎంతగా ప్రభావితం చేస్తుందో వారు మరచిపోతారు. సోషల్ మీడియాలో వ్యూస్,కామెంట్ల కోసం పడే ఆరాటంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూస్తున్నాం. అయితే తాజగా ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఓ వీడియోను తీద్దామనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఆ అమ్మాయి చెట్టు ఎక్కి కొమ్మతో పాటు నేల మీద పడేంత స్టంట్ చేసింది.
@peoplerepentlng అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. ఒక మహిళ చెట్టు యొక్క సన్నని కొమ్మను పట్టుకుని వేలాడుతూ స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ స్టంట్ చేస్తున్న సమయంలో ఎక్కువ ఎనర్జీ ఉపయోగించడం ఆమెకు ఇబ్బందికరమైంది. ఆమె కోతుల లాగా దూకడంతో చెట్టు యొక్క పలుచని కొమ్మ విరిగిపోయింది. చెట్టు కొమ్మ విరిగి మహిళ కొన్ని సెకన్లలో పడిపోయింది. ఆమె ఒక సన్నని కొమ్మను మోస్తూ నేలపై పడిపోయింది. వీడియో చూసిన తర్వాత ఆ మహిళ పడిన బాధను చూసి మీరు కూడా నవ్వుకుంటారు. కొద్దిసేపటి క్రితం వరకు స్టైల్‌గా విన్యాసాలు చేస్తున్న ఆ అమ్మాయి పడిపోగానే మూలుగుతూ వచ్చింది. వాస్తవానికి ఆ మహిళ తన స్టంట్ కోసం చెట్టు యొక్క మందపాటి కొమ్మను ఉపయోగించినట్లయితే, స్టంట్ పూర్తయ్యేది. మరోవైపు,ఈ స్టంట్ ఫెయిల్యూర్ వీడియోకు దాదాపు 3 లక్షల వ్యూస్ వచ్చాయి.
— People Instantly Repenting (@peoplerepentlng) March 22, 2023
Japan couple : జపాన్ లో రాత్రిపూట భార్యాభర్తలు వేర్వేరుగా పడుకుంటారట!కారణం ఇదే
మరోవైపు,ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta) వరుస లేఆఫ్స్ (Layoffs) విధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన వారు తమ అనుభవాలను వివిధ రకాలుగా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా, ‘మెటా’ మాజీ ఉద్యోగిని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏ పనీ చేయనందుకు తనకు రూ.1.50కోట్ల జీతం ఇచ్చేవారని చెప్పుకొచ్చింది. టిక్‌టాక్‌లో చేసిన వీడియోలతో కంపెనీలో తాను పొందిన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు ‘మెటా’ కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేసిన ‘మేడ్‌లిన్ మచాడో’ ఈ వ్యాఖ్యలు చేసింది. మెటా కంపెనీలో పనేమీ ఉండకపోయేదని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా హెచ్‌ఆర్ రిక్రూటింగ్ విభాగంలో తాము ఖాళీగా ఉండేవారమని వెల్లడించింది. ‘కంపెనీలో జాయిన్ అయ్యాక మా బాస్ వచ్చి ఏం చేయొద్దని చెప్పారు. ఆర్నెళ్ల వరకు నియామకాలేవీ జరపొద్దని సూచించారు. బహుశా ఏడాది వరకు కూడా ఇది కొనసాగవచ్చని నాతో చెప్పారు. కంపెనీలో చేరాక మొదటగా వారు చెప్పే మాట ఇదే. దీంతో నాకు దిమ్మ తిరిగింది. ఖాళీగా ఉండటానికి 1,90,000 డాలర్ల(రూ.1.50కోట్లు) వేతనాన్ని ఇస్తున్నారా? అని అనిపించింది’ అని మేడ్‌లిన్ వీడియోలో చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Video