దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా..చాలా గ్రామాలకు సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేవు. ముఖ్యంగా తెలంగాణలోని ఆదివాసి, గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే పాదయాత్రే రవాణా సౌకర్యమనే విషయం జనం మర్చిపోవడం లేదు. గ్రామానికి సరైన రోడ్దు రవాణ సౌకర్యాలు లేక ఇంటికి వెళ్లేందుకు ఓ బాలింత పడిన కష్టం ఇప్పుడు సమాజంలో గ్రామీణ ప్రాంత ప్రజల బతుకు చిత్రాన్ని చూపిస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్(Komurambhim Asifabad)జిల్లా తిర్యాణి(Thiryani)మండలం గోవెన నాయకపు గూడ(Nayakapugudem)గ్రామానికి చెందిన నాగమ్మ (Nagamma)ప్రసవం కోసం నిర్మల్ (Nirmal)జిల్లాలోని పుట్టింటికి వెళ్లింది. కొన్ని రోజుల క్రితం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రసవ అనంతరం బాలింత నాగమ్మ స్వగ్రామం గేవెన నాయకపుగూడా గ్రామానికి బయలుదేరింది. నిర్మల్ నుండి కొమురంభీం ఆసిఫాబాద్ వరకు ప్రత్యేక వాహనంలో వచ్చిన ఆ బాలింత, ఇక్కడి నుండి మళ్ళి బలాన్ పూర్(Balanpur)వరకు చేరుకుంది. ఇక అక్కడి నుండి తమ గ్రామం గోవెన నాయకపోడుగూడకు వెళ్లాలంటే పది కిలోమీటర్ల(10km దూరం ఉంటుంది. దారి మధ్యలో చిన్నపాటి కొండలు, వాగులు దాటుకుంటూ వెళ్ళాలి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కాలినడకనే వెళ్లాలి. ఆ దారిలో టూవీలర్లు సైతం ఎక్కువగా కనిపించవు.
ప్రసూతి మహిళకు కష్టం..
బాలింత నాగమ్మ పుట్టినింట్లో కన్న బిడ్డను చేతుల్లో పెట్టుకొని దగ్గరి బంధువైన ఓ మహిళ సహాయంతో పదికిలోమీటర్ల దూరం నడుచుకుంటూ అత్తారింటికి చేరుకుంది. చంటిపాప ఎత్తుకున్న బాలింత నాగమ్మకు తోడొచ్చిన మహిళ గొడుగు పట్టుకుంటే ఎలాగొలా ఇంటికి చేరింది. అయితే పసిబిడ్డను మోసుకుంటూ కాలినడకన పది కిలోమీటర్లు ఓ ప్రసూతి మహిళ వెళ్తున్న దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పేదరికం నాగమ్మకు కాదు సరైన రోడ్లు నిర్మించుకోలని దయనీయస్థితిలో ఉన్న మన ప్రభుత్వాలది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
10కిలోమీటర్లు కాలినడక..
ఏదైతే బాలింత నాగమ్మ నడుచుకుంటూ వెళ్లిందో ఆ మార్గంలో గతేడాది పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా రోడ్డు వేశారు.. అదికాస్తా వర్షాలకు కొట్టుకుపోయి అధ్వాన్నంగా తయారై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కనీసం ద్విచక్ర వాహానాలు కూడా సునాయసంగే వెళ్ళే పరిస్థితి లేనంతగా మారిపోయింది. పసిబిడ్డను మోస్తూ బాలింత ఇంత ఇబ్బంది పడితే ప్రాణపాయస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని అంతదూరం మోసుకెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏమిటని సామాన్యప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు, జనాభా లెక్కల కోసం వచ్చే అధికారులు ఇప్పటికైనా స్పందించి మారుమూల గిరిజన గూడెలు, తండాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు వేయాలని..రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదివాసి ప్రజలు, స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నాయకులు, ఇక్కడి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Pregnent women, Viral Video