హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: షాకింగ్.. వెంట్రుక వాసిలో బతికి పోయిన మహిళా.. వీడియో వైరల్..

OMG: షాకింగ్.. వెంట్రుక వాసిలో బతికి పోయిన మహిళా.. వీడియో వైరల్..

బోల్తాపడిన ఆటో

బోల్తాపడిన ఆటో

Viral video: మహిళ రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఆమెకు ముందు ఒక ఆటో ఆగి ఉంది. అప్పుడు స్పీడ్ గా వచ్చిన కారు, ఆటోను బలంగా ఢీకొట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు.. మనమే ఏదైన ఊహించని ప్రమాదంలో పడోచ్చు. అయితే.. కొన్నిసందర్భాలలో వెంట్రుక వాసిలో దాన్నుంచి బయటపడతాము. కొందరు కారు లేదా టూవీలర్ పైన వెళ్తుంటారు. అలాంటి సందర్బాలలో కొన్నిసార్లు.. ప్రమాదం బారిన పడతారు. మన కళ్ల ముందే.. ఎక్కడ చనిపోతాడో అనుకుంటాం.. కానీ.. లక్ బాగుండి బయటపడతారు. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ట్రాఫిల్ రూల్స్ పాటించాలని అధికారులు మోత్తుకున్న, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఇప్పటికి చాలా మంది తమ బుద్ధిని మాత్రం మార్చుకొవడంలేదు. ఇప్పటికీ రాంగ్ రూట్ లో వెళ్లడం, త్రిబుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకొకపోవడం, కారులో సీటు బెల్ట్ ను అవాయిడ్ చేస్తుంటారు. మరికొందరు తాగి వెహికిల్ లను నడిపిస్తుంటారు. రాంగ్ రూట్ లో పార్కింగ్ చేస్తుంటారు. ఇలాంటి సందర్బాలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక మహిళ రోడ్డు పైన దారిలో తాను నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఆమెకు ఎదురుగా కొంత దూరంలో ఆటో నిలిపి ఉంది.


అయితే.. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. ఒక కారు వేగంగా వచ్చింది. అది వచ్చి.. ఆటోను బలంగా ఢీకొట్టింది. అప్పుడు ఎగిరి ఒక వైపు బోల్తా పడింది. కారు మరో వైపుకు వెళ్లిపడింది. ఇవి రెండు కూడా మహిళకు వెంట్రుక వాసిలో దూరంలో నుంచి వెళ్లిపోయాయి.  దీంతో ఆమె భయంభయంగా అలానే చూస్తూ ఉండిపోయింది. అక్కడున్న వారంతా.. మహిళకు ఏమైపోయిందో అని భయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోను ఐపీఎస్ సజ్జనార్ (VC Sajjanar)  తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి మహిళ లక్ బాగుంది.. అందుకే వెంట్రుక వాసిలో తప్పించుకుందంటూ కామెంట్ జతచేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘యముడు లంచ్ బ్రేక్ లో ఉన్నాడేమో... ’, షాకింగ్.. వెంట్రుక వాసిలో బతికి పోయిన మహిళా... అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Road accident, Sajjanar, Viral Video

ఉత్తమ కథలు