Virla Video: తల్లి కావడం అనేది పెళ్లైన ప్రతి మగువ కోరిక. ఆ సర్ప్రైజ్ విషయాన్ని భర్తకు చెప్పడం అనేది మరో మరపురాని అనుభూతి. ఈ కథలో అమెరికా... అరిజోనాకి చెందిన యువతి హేలీ బేజ్ తాను ప్రెగ్నెంట్ అయిన విషయం తెలుసుకొని ముందుగా తాను ఎంతో ఎగ్జైట్ అయ్యింది. చాలా సేపు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. నెక్ట్స్ ఆ విషయాన్ని భర్తకు ఎలా చెప్పాలి అని బాగా ఆలోచించింది. రొటీన్‌గా చెప్పేయడానికి ఇది రొటీన్ విషయం కాదు కదా... సో... క్రియేటివ్‌గా చెప్పాలనుకుంది. నకిలీ లాటరీ టికెట్ ద్వారా చెప్పాలని ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారమే... రెండు లాటరీలు తెచ్చి... వీటిని స్క్రాచ్ చేద్దాం అని భర్తకు చెప్పింది. సరే అని చెరొకటి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త రిక్... స్క్రాచ్ చేసీ చెయ్యడంతోనే... విషయం తెలుసుకొని... సూపర్ ఎక్సైట్ అయిపోయాడు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు.
ఇదంతా వీడియో రికార్డ్ తీసిన ఆమె యూట్యూబ్‌లో షేర్ చేసింది. తన తండ్రిని అవుతున్న విషయం తెలియగానే రిక్ చూపించిన ఎక్స్ప్రెషన్... ప్రేక్షకుల కళ్లలో ఆనంద భాష్పాలు తెప్పిస్తోంది. అందరూ ఆ కపుల్స్‌ని మెచ్చుకుంటున్నారు. వాళ్లకు మంచి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.
ఇది కూడా చదవండి: Bhakti: వాస్తు ప్రకారం పూజ గది ఎలా ఉండాలి... ఏ కలర్ పెయింట్ వెయ్యాలి... తెలుసుకోండి
ఇంతకీ ఆ స్క్రాచ్ కార్డులో ఆమె ఏం రాసిందో తెలుసా... "మీరు మూడు గోల్డ్ బార్లు గెలుచుకున్నారు... మీ ప్రైజ్... ఓ బేబీ" అని రాసింది. మొదట రిక్కి అదేంటో అర్థం కాలేదు. కొన్ని క్షణాల్లో అసలు విషయం అర్థమైంది. ఇదంతా తన భార్య తనకు ఈ విషయం చెప్పడానికి చేసిన ట్రిక్ అని తెలిసి... తెగ ఆనందపడ్డాడు. తండ్రి అవ్వడం అనేది ప్రతి భర్తకూ ఓ ఎక్సైట్మెంట్... రిక్ కళ్లలో అది మనం చూడవచ్చు.
Published by:Krishna Kumar N
First published:February 20, 2021, 10:37 IST