హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Trending: కారులో వచ్చి బిచ్చమెత్తుకుంటున్న మహిళ.. షాకైన పోలీసులు

Trending: కారులో వచ్చి బిచ్చమెత్తుకుంటున్న మహిళ.. షాకైన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral News: అబుదాబి వీధుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ మహిళ గురించి సమాచారం అందినప్పటి నుండి పోలీసులు ఆమె గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏమీ చేయడానికి శక్తి లేక బతికేందుకు చాలామంది యాచకులుగా మారుతుంటారు. కానీ కొందరు మాత్రం యాచకులుగా వచ్చే ఆదాయంతో లక్షలు, కోట్లు వెనకేస్తుంటారు. అలాంటి వాళ్ల గురించి మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అలాంటి ఓ మహిళను కొద్దిరోజుల క్రితం అబుదాబి పోలీసులు అరెస్ట్ చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి(Abudabi) పోలీసులు అనేక మంది యాచకులను(Beggars) అరెస్టు చేశారు. వారిలో ఒక మహిళ నుండి లగ్జరీ కారు కనుగొన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో 159 మంది యాచకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ఆమె వద్ద నుంచి లగ్జరీ కారు(Luxury Car) స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నివాసం ఉంటున్న వారు ఈ మహిళ గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మహిళ తన కారును పార్క్ చేసిన తర్వాత భిక్షాటన చేసేందుకు నగరంలోని అనేక మసీదుల వెంట వెళ్లేది.

అబుదాబి వీధుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ మహిళ గురించి సమాచారం అందినప్పటి నుండి పోలీసులు ఆమె గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆమె ప్రతి కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ మహిళ నగరంలోని పలు ప్రాంతాల్లోని మసీదుల ముందు భిక్షాటన చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ మహిళ తన లేటెస్ట్ మోడల్ లగ్జరీ కారును పార్క్ చేసిన తర్వాత చాలా దూరం నడిచి వెళ్లి అడుక్కునేది. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె వద్ద నుంచి భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

చట్టవిరుద్ధం మరియు నేరం. రిజిస్టర్డ్ సంస్థలకు మాత్రమే విరాళాలు ఇవ్వాలని పోలీసులు ప్రజలకు గుర్తు చేస్తూ ఉంటారు. ఎవరైనా భిక్షాటన చేస్తూ పట్టుబడితేవారికి 5000 అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ జరిమానా మరియు 3 నెలల జైలు శిక్ష విధిస్తారు. దీనితో పాటు ఈ యాచకులను నిర్వహించేవారికి 100,000 అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్ జరిమానా, సుమారు ఆరు నెలల శిక్ష విధించబడుతుంది.

Hydrogen Trains : వందేభారత్ తాత్కాలికమేనా.. కేంద్రం ప్లాన్ వేరే ఉందా?

10 Photos : భూమి మధ్యలోని కోర్.. తిరగడం మానేసిందా? ఏం జరగబోతోంది?

యూఏఈలో ఆన్‌లైన్‌లో యాచించడం కూడా చట్టవిరుద్ధం. సోషల్ మీడియా, వచన సందేశాలు, ఇమెయిల్ లేదా మరేదైనా ప్లాట్‌ఫారమ్ ద్వారా యాచించడం కూడా చట్టబద్ధంగా చెల్లదు.

First published:

Tags: Trending, VIRAL NEWS

ఉత్తమ కథలు