హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: జూమ్ వీడియో కాల్‌లో భర్తకు ముద్దుపెట్టబోయిన భార్య... ఆ తర్వాత జరిగింది ఇదే

Viral Video: జూమ్ వీడియో కాల్‌లో భర్తకు ముద్దుపెట్టబోయిన భార్య... ఆ తర్వాత జరిగింది ఇదే

Viral Video | జూమ్ కాల్, జూమ్ మీటింగ్స్‌లో జరిగే ఫన్నీ దశ్యాలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాంటి మరో వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

  లాక్‌డౌన్ కారణంగా ఎక్కువగా వీడియో కాన్ఫరెన్సింగ్‌కే అలవాటు పడ్డారు ఉద్యోగులు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులంతా జూమ్ కాల్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్... ఇలా వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇలాంటి మీటింగ్స్‌లో ఎన్నో సరదా సన్ని వేశాలు జరుగుతున్నాయి. అవి వైరల్ అవుతున్నాయి. అలాంటి మరో వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి జూమ్ కాల్ మీటింగ్‌లో ఉండగా భార్య వచ్చి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించడం రికార్డ్ అయింది. ఇంతలో భర్త వారించడంతో ఆమె వెనక్కి వెళ్లిపోయింది. అంతే... ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను ట్వీట్ చేశారు. Zoom call .....so funny ? ?? అంటూ కామెంట్ చేశారు.

  Google Home Mini: గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్ రూ.499 ధరకే కొనండి ఇలా

  IRCTC Goa Tour: గోవాకు హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

  ఈ వీడియో మూడున్నర లక్షల మందికి పైగా చూశారు. వేల మంది లైక్ చేశారు. రీట్వీట్లు, కామెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ట్వీట్‌పై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ లేడీని వైఫ్ ఆఫ్‌ ది ఇయర్‌గా నామినేట్ చేస్తానని, ఒకవేళ ఆ భర్త సంతోషించి ఉంటే కపుల్ ఆఫ్ ది ఇయర్‌గా నామినేట్ చేసేవాడినని ఆనంద్ మహీంద్రా అన్నారు.

  Prepaid Plans: 84 రోజుల వేలిడిటీతో Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే

  Amazon Fab Phones Fest: అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్

  ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జూమ్ కాల్‌లో, గూగుల్ మీట్‌లో ఇలాంటి సరదా సన్నివేశాలెన్నో రికార్డ్ అవుతున్నాయి. అందరూ ఇంట్లోనే ఉంటూ, ఇంటి నుంచే పనిచేస్తూ, ఆఫీస్ మీటింగ్స్‌కి అటెండ్ అవుతుండటం వల్ల ఈ కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి.

  First published:

  Tags: Anand mahindra, Funny video, Trending videos, Viral, VIRAL NEWS, Viral Video, Viral Videos

  ఉత్తమ కథలు