సాధారణంగా పెళ్లయ్యాక (Wedding) కోడలు అత్తగారింటికి వెళ్తుంది. అక్కడి పరిస్థితులు, వాతావరణం కాస్త భిన్నంగా ఉంటాయి. అమ్మాయిలు, అది అలవాటు చేసుకొవడానికి సమయం పడుతుంది. పెళ్లైన కొత్త జంటలలో వివాదాలు (family disputes) రావడం కామన్. వాటిని సామరస్యంగా పెద్దల మధ్య కూర్చుని పరిష్కరించుకోవాలి. కొందరు తమ మధ్య వివాదాలు వస్తే.. కూల్ గా సాల్వ్ చేసుకుంటారు. మరికొందరు పెద్ద రచ్చ చేస్తారు. పంచాయితీలు పెట్టుకుంటూ నానా హంగామా చేస్తుంటారు.
కొందరు అమ్మాయిలు, పుట్టిన ఇంట్లో అత్యంత గారాబాంగా పెరుగుతారు. అత్తింటికి వెళ్లాక అలాగే ఉండాలను కుంటారు. తమదే నడవాలని అనుకుంటారు. పెద్ద వారు ఏమైన చెప్పిన అసలు తలకు ఎక్కించుకోరు. ప్రతిదానికి ఎదురు మాట్లాడుతారు. మరికొందరు పెళ్లి కాగానే.. వేరే కాపురం, ఆస్తి వివాదాలు మొదలెడతారు. ప్రాపర్టీని తన పేరుమీద రాయాలిని, తనదే నడవాలని దిగజారీ ప్రవర్తిస్తుంటారు.
ఈ మధ్య కాలంలో కోడళ్ళు ఒక అడుగు ముందుకు వేసి అత్యుత్సాహంతో.. ప్రతి దానికి అత్త, ఆడబిడ్డల మీద కేసులు పెట్టడం కామన్అయిపోయింది. ప్రతిదానికి భర్తను బెదిరిస్తు.. అత్తింటివారిపై వేధింపుల కేసు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో కుటుంబాల మధ్య తగాదాలు జరిగి సంసారం కాస్త రోడ్డున పడుతుంది. ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) అలీఘడ్ లో ఒక కుటుంబం మధ్య తగాదా ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అలీఘడ్ లోని ఒక వృద్ధ మహిళ ఆమెకు భర్త ఇల్లు కట్టించి ఇచ్చాడు. తనకుమారుడికి పెళ్లి చేసింది. కోడలు వచ్చిన కొన్ని రోజులకే అత్తను ఇంటినుంచి వెళ్లగొట్టింది. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు అత్త అలాగే ఉండిపోయింది. కాగా, ఆమె మంగళవారం తన ఇంట్లో కూతురు, అల్లుడుతో కలిసి ప్రవేశించింది. దీంతో కోడలు రెచ్చిపోయింది. అత్తపై దాడికి దిగింది. జుట్టుపట్టుకుని బయటకు తోసేసింది. మధ్యలో వచ్చిన ఆడబిడ్డ, బావగారిపై కూడా అమానుషంగా ప్రవర్తించింది. ఇద్దరిని జుట్టుపట్టుకుని లాగి కోడుతూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. కాగా, ఆస్తి వివాదం వలనే కోడలు ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.