Honeymoon: పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్‌కు వెళ్లారు.. అక్కడ అలా జరగడంతో మైండ్ బ్లాక్.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఎన్నో కొత్త ఆశలతో ఇద్దరు కలిసి జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే చాలా జంటల మాదిరిగా హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు.

 • Share this:
  వారిద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఎన్నో కొత్త ఆశలతో ఇద్దరు కలిసి జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే చాలా జంటల మాదిరిగా హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. హనీమూన్‌(Honeymoon) కోసం అందమైన ప్లేస్‌ను ఎంపిక చేసుకుని అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరి ప్రేమను తెలుసుకునేలా ఈ ట్రిప్ సాగాలని భావించారు. కానీ వారి కలలపై కరోనా కాటేసింది. హనీమూన్ ప్లేస్‌ చేరుకున్నాక.. అక్కడ జరిపిన పరీక్షల్లో వధువకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి హనీమూన్ కలలు చెదిరిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే. వివరాలు.. పశ్చిమ లండన్‌లోని(London) కిస్విక్ ప్రాంతాని చెందిన అమీ(27), అల్బెర్టో(33)‌లు పెళ్లి(Marriage) చేసుకున్నారు.

  పెళ్లి జరిగిన మూడు రోజులకు వారు హనీమూన్ కోసం బార్బడోస్ (Barbados) బయలుదేరారు. లండన్ నుంచి బయలుదేరే ముందు అమీ, అల్బెర్టో అవసరమైన పీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఇద్దరికి కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక, వారిద్దరు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ ఎయిర్‌పోర్ట్‌కు (Bridgetown Airport) చేరుకున్నారు. అక్కడ వారిద్దరికి సంబంధిత సిబ్బంది.. కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేయమని వారితో చెప్పారు. తీరా ఆ రిపోర్ట్స్‌లో అల్బెర్టోకు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ కాగా, అమీ రిపోర్ట్ కరోనా పాజిటివ్‌గా తేలింది.

  Newly Married Woman: పెళ్లైన రెండు రోజులకే విడాకులు కావాలన్న భార్య.. కాపురం చేయలేనని కోర్టుకు.. అసలేం జరిగిందంటే..

  దీంతో అక్కడి సిబ్బంది ఆమెకు వెయిట్ చేయమని చెప్పారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడే ఉంది. తర్వాత ఆమెను ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆ ఐసోలేషన్ సెంటర్ ఓ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయబడి ఉంది. కరోనా పాజిటివ్‌గా(Covid Positive) తేలినందును 10 రోజులు పాటు ఆమెను అక్కడే ఉండాలని సూచించారు. దీంతో అమీ.. తనుకు తెలియని ఆరుగురు వ్యక్తులతో కలిసి ఆ గదిలో ఉండాల్సి వచ్చింది. అక్కడ నీటి వసతి, టాయిలెట్స్ సరిగా లేవని ఆమె పేర్కొంది.

  Job Portal: వృద్ధులకు గుడ్ న్యూస్.. వారి కోసం ఆన్‌లైన్ జాబ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌.. పోర్టల్ ప్రత్యేకతలు ఇవే..

  ఇక, ఆ రోజు రాత్రి మొత్తం అమీ తన భర్తతో మాట్లాడుతూనే ఉంది. అమీ పరిస్థితి చూసి ఆమె భర్త అల్బెర్టో ఆందోళన చెందాడు. వెంటనే ఆమెను ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక్క రోజుకు రూ. 40 వేలు చెల్లించాల్సి వచ్చింది. వార్డు ఫీజు రూ. 22,000, డాక్టర్ ఫీజు రూ. 18,000గా చెల్లిస్తూ వచ్చారు. మరోవైపు అల్బెర్టో తన సెల్ఫ్ ఐసోలేషన్ కోసం ఓ చిన్న గదిలో ఉండసాగాడు.

  Woman Cop: మహిళా పోలీసుపై సాముహిక అత్యాచారం.. నిందితుడి తల్లి కూడా అరెస్ట్.. బర్త్‌డే పార్టీ కోసమని..

  ఇక, ఈ పరిస్థితుల్లో ఆ జంట ముందుగా బుక్ చేసుకున్న హోటల్ యజమాన్యం.. వారి డబ్బులను రీఫండ్ చేయలదే. ఇక, పరిస్థితులు చక్కబడిన తర్వాత వారు తిరిగి తమ స్వస్థలానికి చేరుకున్నారు. అయితే హనీమూన్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్లిన జంట.. కరోనా కారణంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. తమ జీవితంలో మధురమైన గుర్తుగా ఉండాల్సిన ఆ ట్రిప్.. చేదు అనుభవంగా మారింది. ఇప్పటికే చాలా డబ్బులు కోల్పోయిన ఆ జంట.. స్వస్థలానిక చేరిన తర్వాత వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యారు.
  Published by:Sumanth Kanukula
  First published: