Home /News /trending /

WOMAN SWAPS PROSTHETIC EYE WITH GOLD NOW LIVES LIFE FULLY PVN

Eye with gold: ఈమె చూపే బంగారం

బంగారు కన్నుతో డానీ విన్రో

బంగారు కన్నుతో డానీ విన్రో

Prosthetic Eye with gold : ఇంగ్లండ్‌(England)లోని లివర్‌పూల్‌లో నివసించే "డానీ విన్రో"అనే మహిళ కృత్రిమ బంగారపు కన్ను కలిగి ఉంది. చిన్నతనంలో అనారోగ్యం కారణంగా తొలగించబడిన ఒక కన్ను(Eye)ఇప్పుడు డానీకి బంగారం(Gold)తో భర్తీ చేయబడింది.

ఇంకా చదవండి ...
Prosthetic Eye with gold : ఇంగ్లండ్‌(England)లోని లివర్‌పూల్‌లో నివసించే "డానీ విన్రో"అనే మహిళ కృత్రిమ బంగారపు కన్ను కలిగి ఉంది. చిన్నతనంలో అనారోగ్యం కారణంగా తొలగించబడిన ఒక కన్ను(Eye)ఇప్పుడు డానీకి బంగారం(Gold)తో భర్తీ చేయబడింది. అనేక సార్లు ఒక వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన శరీర భాగాలను త్యాగం చేయవలసి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రజలు దీన్ని చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రాణం రక్షింపబడుతుంది కానీ ఒక వ్యక్తి తన జీవితాంతం ఏ ప్రత్యేక భాగం లేకుండా గడపవలసి ఉంటుంది. లివర్‌పూల్ నివాసి డానీ విన్రో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.

డానీకి కేవలం 6 నెలల వయస్సులో రెటినోబ్లాస్టోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది ఒక రకమైన అరుదైన కంటి క్యాన్సర్. దీంతో వైద్యులు అతడి ఒక కన్ను పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత వైద్యులు ఆమెకు కృత్రిమ కన్ను వేశారు. కూతురి ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ డానీ ఈ కన్నుతో ఎప్పుడూ సంతోషంగా లేదు. ఇప్పుడు డానీ తన కృత్రిమ కంటిని బంగారతో భర్తీ చేసింది. డానీ తన బంగారు కన్ను ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. డానీ కన్ను ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది.



Kim Jong Un : కిమ్ తీవ్ర హెచ్చరిక..ఆ దేశాలపై అణుబాంబులు వేయడానికి సిద్ధం!

డానీ కన్ను తొలగించబడినప్పుడు ఆమె వయస్సు కేవలం 6 నెలలు మాత్రమే. . శస్త్రచికిత్స(Operation)తర్వాత డానీకి గాజు కన్ను ఇవ్వబడింది. అయితే ఇది చూసి డానీని తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. అయితే భవిష్యత్తులో కూడా కృత్రిమ కన్ను కారణంగా ప్రజలు తనను ఎగతాళి చేస్తారని డానీ భావించింది. దీంతో కొన్నాళ్లుగా ప్రజల వెక్కిరింతలు వింటున్న డానీకి ఇప్పుడు బంగారంతో కూడిన కన్ను ఏర్పాటు చేయబడింది. ఈ బంగారు కన్నుతో తాను చాలా సౌకర్యంగా ఉన్నట్లు డానీ తెలిపింది. ఈ కంటికి డానీ 15 వేలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు తన లుక్‌తో చాలా హ్యాపీగా ఉంది. మొదటిసారిగా తన జీవితాన్ని సాధ్యమైనంత ఉత్తమంగా జీవించగలుగుతున్నానని డానీ చెప్పింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Eye sight, Gold, Uk

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు