హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

స్టెప్ బ్రదర్‌తో యువతి డేటింగ్.. చాలా కాలంగా అతనిపై ఫీలింగ్స్.. రిలేషన్‌పై వారు ఎమన్నారంటే..

స్టెప్ బ్రదర్‌తో యువతి డేటింగ్.. చాలా కాలంగా అతనిపై ఫీలింగ్స్.. రిలేషన్‌పై వారు ఎమన్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతి తన స్టెప్ బ్రదర్‌తో డేటింగ్‌కు సిద్దమైంది. కొంతకాలంగా అతనిపై ఫీలింగ్స్ ఉన్నట్టు ఆ యువతి వెల్లడించింది.

  ఓ యువతి తన స్టెప్ బ్రదర్‌తో డేటింగ్‌కు సిద్దమైంది. కొంతకాలంగా అతనిపై ఫీలింగ్స్ ఉన్నట్టు ఆ యువతి వెల్లడించింది. ఇదంతా జరిగింది ఎక్కడంటే.. సీక్రెట్ క్రష్ అనే డేటింగ్ షోలో. ఇక్కడ షోలో పాల్గొనేవారు డేట్‌కు వెళ్లే ముందు తమకు ఇష్టమైనవారిపట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. వివరాలు.. సీక్రెట్ క్రష్ అనే షోలో పాల్గొన్న మాడ్డీ అనే యువతి తనకు కల్లమ్ చిన్నప్పటి నుంచి తెలుసుని చెప్పింది. గతంలో తన తల్లి, కల్లమ్ తండ్రి కొంతకాలం కలిసి ఉన్నారని.. వారి మధ్య బంధం ఉందని.. అయితే పెళ్లి మాత్రం జరగలేదని తెలిపింది. ‘నేను కల్లమ్‌ను ఇష్టపడుతున్నానని చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. స్పష్టంగా చెప్పాలంటే మా మధ్య ఎలాంటి బంధం లేదు. నా తల్లి, అతని తండ్రి చాలా ఏళ్ల క్రితం కలిసి ఉన్నారు. నేను కల్లమ్‌ను సోషల్ మీడియా వేదికగా కాంటాక్ట్ అయినప్పడు చాలా పరిణితి చెందిన వ్యక్తిగా, చాలా గుడ్ లుకింగ్‌గా అనిపించాడు. కల్లమ్ 9 ఏళ్ల కిందట నా తల్లి బాయ్‌ఫ్రెండ్ కొడుకు. అతను నా మాజీ స్టెప్ బ్రదర్’అని నేను అనుకుంటున్నానను అని మాడ్డీ తెలిపింది.

  ఇక, మాడ్డీ, కల్లమ్‌లు వారి తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఒకరినొకరు కలుసుకోలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం టచ్‌లో ఉన్నారు. అక్కడే వారి మధ్య పరిచయం చనువుకు దారితీసి ఉంటుంది. ప్రస్తుతానికి తన తల్లితోనే కలిసి ఉంటున్న మాడ్డీ.. కల్లమ్ ఏం సమాధానం చెప్తాడనే దానిపై చాలా ఉత్సాహంగా ఉందని పేర్కొంది. ఇక, మాడ్డీకి తన పట్ల ఇష్టం, ఫీలింగ్స్ ఉందని తెలుసుకున్న కల్లమ్ ఆశ్చర్యపోయాడు. ‘ఇది నువ్వేనని నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగా క్రేజీ’అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. మాడ్డీతో ముందుకు న‌డిచేందుకు అభ్యంత‌రం లేద‌ని చెబుతున్నాడు. త‌మ త‌ల్లితండ్రులు విడిపోయిన ఇన్నేళ్ల త‌ర్వాత ఆమె మ‌న‌సులో తానుండ‌టం చెప్పలేని అనుభూతిని అందిస్తోంద‌ని మురిసిపోయాడు.

  వీరి రిలేషన్ చట్టబద్దత గురించి చర్చ వచ్చినప్పుడుమాడ్డీ స్పందిస్తూ.. మేము చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామని అనుకోవడం లేదని తెలిపింది. మరోవైపు కల్లమ్ స్పందిస్తూ.. తన తండ్రి, మాడ్డీ తల్లి పెళ్లి చేసుకోలేదు కాబట్టి తాము స్టెప్ బ్రదర్, సిస్టర్ కామని అన్నాడు.

  ఇంకా కల్లమ్ మాట్లాడుతూ.. దీనిపై తన తండ్రి కొద్దిగా కోపపడతాడని అనుకుంటున్నట్టు తెలిపాడు. అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదని కానీ.. తాను మాత్రం పట్టించుకోనని చెప్పాడు. నిజంగా మాడ్డీ ఒక అద్బుతమని తాను నమ్ముతున్నట్టు చెప్పాడు. ఆమె చాలా అందమైన అమ్మాయి అని పొగడ్తలతో ముంచెత్తాడు. మరోవైపు మాడ్డీ. కల్లమ్‌ను తన తల్లి వద్దకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది. ఆమె ఫేస్‌లో రియాక్షన్ చూసేందుకు ఉత్సాహంతో ఉన్నట్టు మాడ్డీ తెలిపింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Dating, Tv show

  ఉత్తమ కథలు