Home /News /trending /

WOMAN SPOTTED MYSTERIOUS FIGURE LOOK ALIKE GHOST STANDING OVER GRANCH DAUGHTER IN US HERE IS PHOTOS SK

అర్ధరాత్రి అందరూ పడుకున్నా.. ఆ చిన్నారి ఎవరితో మాట్లాడుతోంది? అక్కడున్నది దెయ్యమేనా?

సీసీ కెమెరాలో గుర్తు తెలియని ఆకారం

సీసీ కెమెరాలో గుర్తు తెలియని ఆకారం

దెయ్యంలా ఉన్న ఆకారానికి తలపై కొమ్ములు ఉన్నాయి. పొడవాటి గోర్లు ఉన్నాయి. పాప బెడ్‌ పక్కనే అది కనిపించింది. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలను చూసి కుటుంబ సభ్యులంతా షాక్ తిన్నారు.

    దెయ్యాలు ఉన్నాయా? లేవా.? శతబ్ధాలుగా సమాధానం దొరకని ప్రశ్న ఇది. అసలు ఈకాలంలో దెయ్యాలంటి? మీ పిచ్చి కాకుంటేనూ.. అని సైన్స్‌ను నమ్మే ప్రజలు చెబుతారు. దేవుడు ఉన్నారన్నది ఎంత నిజమో దుష్ట శక్తులున్నాయన్నది కూడా అంతే నిజమని.. మరికొందరు చెబుతారు. ఎవరి వాదన వారిది. కానీ దెయ్యాలు గురించి చర్చ మాత్రం ఎప్పుడూ హాట్ సబ్జెక్టే. తాజాగా ఓ వార్త అమెరికాను ఊపేస్తోంది. ఓ రెండేళ్ల చిన్నారి గుర్తు తెలియని ఆకారంతో మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల్లో చూపించినట్లుగా ఆ ఆకారం దెయ్యంలా ఉంది. అసలు ఆ పాప ఎవరితో మాట్లాడుతుంది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

    లాస్‌వెగాస్‌కు చెందిన 41 ఏళ్ల టోరీ మెక్ కెంజీ అనే మహిళ తన కొడుకు కోడలితో కలిసి నివసిస్తోంది. తన కుమారుడికి రెండేళ్ల వయసున్న పాప అంబర్ ఉంది. కొంత కాలంగా ఆ చిన్నారి అంబర్ అర్ధరాత్రి వేళ మాట్లాడుతూ కనిపించింది. కానీ అక్కడా ఎవరూ లేవరు. అందరూ పడుకొని ఉన్నారు. మరి ఆ పాప ఎవరితో మాట్లాడుందో అర్ధం కాలేదు. అప్పుడే మెక్ కెంజీకి ఓ ఆలోచన వచ్చింది. ఇంట్లో పాప పడుకునే గదిలో ఓ సీసీ కెమెరాను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు అంతా నార్మల్‌గానే ఉంది. ఇటీవల మెక్ కెంజీ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిచింది. కొన్ని రోజుల పుటేజీలో అంతా సాధారణంగానే కనిపించింది. కానీ ఓ ఫుటేజీలో మాత్రం షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.

    దెయ్యంలా ఉన్న ఓ ఆకారంతో పాప మాట్లాడుతూ కనిపించింది. వాస్తవానికి ఈ రెండేళ్ల పాపకు స్పష్టంగా మాటలు రావు. ఇప్పుడిప్పుడే పదాలు పలుకుతోంది. అలాంటి పాప ఆ ఆకారంతో తనకు తోచినట్లుగా మాట్లాడుతూ కనిపించింది. దెయ్యంలా ఉన్న ఆకారానికి తలపై కొమ్ములు ఉన్నాయి. పొడవాటి గోర్లు ఉన్నాయి. పాప బెడ్‌ పక్కనే అది కనిపించింది. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలను చూసి కుటుంబ సభ్యులంతా షాక్ తిన్నారు. దుష్ట శక్తులను తరిమికొట్టేందుకు ఒక రకమైన నూనెతో ఇంట్లో పొగబెట్టారు. ఆ సమయంలో కిటికీ కర్టెన్స్ తెరచుకొని వెంటనే మూసుకున్నాయని టోరీ మెక్‌ కెంజీ తెలిపింది.

    సీసీ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలను ఘోస్టెడ్ యూకే అనే యూజర్ ఫేస్ బుక్‌ పేజీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అందులో ఉన్నది నిజమేని.. ఫేక్ ఫొటోలు కాదని టోరీ మెక్‌కెంజీ తెలిపింది. తనకు టెక్నాలజీ గురించి చాలా తక్కువ తెలుసి.. వాటిని మార్ఫింగ్ చేయడం తనకు రాదని క్లారిటీ ఇచ్చింది. ఈ మిస్టరీ ఏంటో చెప్పాల్సిందిగా పారానార్మల్ ఎక్స్‌పర్ట్స్‌ను కోరుతోంది. ఐతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు నిజమేనని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు. దెయ్యాలు లేవు.. ఏమీ లేవని అభిప్రాయపడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: America, Trending, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు