హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కారులో కనిపించిన పాము... షాకైన మహిళ... ఎలా వచ్చిందంటే...

కారులో కనిపించిన పాము... షాకైన మహిళ... ఎలా వచ్చిందంటే...

కారులో కనిపించిన పాము... షాకైన మహిళ... (credit - Facebook)

కారులో కనిపించిన పాము... షాకైన మహిళ... (credit - Facebook)

పాము విషపూరితమైనది కాబట్టి... దానితో పెట్టుకుంటే ప్రమాదమే. ఆ మహిళ కారులో వెళ్తుండగా... కారు లోపల పాము కనిపించింది.

ఇంటర్నెట్‌ను షేక్ చేసే ఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇది అలాంటిదే. సపోజ్ మీరు ఓ కారును డ్రైవ్ చేసుకుంటూ... ప్రశాంతమైన రోడ్డులో... అలా అలా వెళ్తున్నారని అనుకుందాం. చుట్టూ చెట్లు, చల్లటి గాలి తగులుతుంటే... ఆ రైడింగ్ మనసుకు ఎంతో ఆహ్లాదకరం. అమెరికా... మిస్సోరీలో ఆమె కూడా ఇలాగే... కారు డ్రైవ్ చేసుకుంటూ హాయిగా వెల్తోంది. ఇంతలో ఏదో చిన్న అలికిడి వచ్చింది. ఆ సౌండ్ వచ్చిన ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది. ఏమీ కనిపించలేదు. "ఆ ఏం లేదులే" అనుకుంటూ.... అలా ముందుకు వెళ్లసాగింది. ఈసారి... బుస్ మని శబ్దం వినిపించింది. వెంటనే మరోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది. ఏమీ కనిపించలేదు. బట్... ఆమెకు మనసులో తేడా కొట్టింది. ఆ సౌండ్ ఎందుకొచ్చింది అన్న డౌట్ వదల్లేదు.

అన్ని దిక్కులూ చూడగా... కారు ఫ్లోర్ బోర్డ్ కింద... ఓ పాము చుట్టుకొని ఉండటాన్ని చూసింది. అమ్మో పాము... బబోయ్ పాము... అనుకుంటూ... కార్ బ్రేక్ వేసి... గబగబా దిగిపోయి... కాస్త దూరం వెళ్లి నిల్చుంది. మళ్లీ వెంటనే కారు దగ్గరకు వచ్చి... కారు అన్ని డోర్లూ లాక్ తీసేసి... డోర్లు తెరిచి... దూరంగా వెళ్లి నిల్చుంది. వణికిపోతూ... యురేకా పోలీసులకు కాల్ చేసి... విషయం చెప్పింది. డోంట్ వర్రీ... మేం చూసుకుంటాం.. అంటూ వాళ్లు బయల్దేరారు.

పోలీసులు వచ్చి పామును చూశారే గానీ దాన్ని బయటకు పంపలేకపోయారు. ఇలాగైతే లాభం లేదనుకుంటూ... వాహనాలని లాక్కెల్లే వాహనానని తీసుకొచ్చి... కారును దానికి లింక్ పెట్టి... రోడ్డు పై నుంచి... వేరే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. పాము బయటకు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసారు. ఈ లోగా పాముల్ని కాపాడే వాళ్లు వచ్చారు. అప్పటికే పాము కారు నుంచి బయటకు వచ్చింది. వాళ్లు పామును తీసుకెళ్లి... సేఫ్ లొకేషన్‌లో వదిలేస్తామని చెప్పారు.

ఆ మహిళ పోలీసులకు థాంక్స్ చెప్పి... డ్రైవింగ్ చేస్తూ వెళ్లసాగింది. కారు అలా వెళ్తుండగా... ఒక్కసారిగా ఏదో సౌండ్ వచ్చింది. ఆమె తుళ్లిపడింది. అది ఆమె మొబైల్ రింగ్.....

First published:

Tags: America, VIRAL NEWS

ఉత్తమ కథలు