హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కల కంటూ ఎంగేజ్‌మెంట్ రింగ్ మింగేసింది... ఆతర్వాత

కల కంటూ ఎంగేజ్‌మెంట్ రింగ్ మింగేసింది... ఆతర్వాత

కల చూస్తూ ఎంగేజ్‌మెంట్ రింగ్ మింగేసింది... ఆతర్వాత

కల చూస్తూ ఎంగేజ్‌మెంట్ రింగ్ మింగేసింది... ఆతర్వాత

తెల్లారి లేచి చూసే సరికి కల నిజం కాలేదు కానీ. కలలో చేసిటన్లు నిజంగానే జెన్నా రింగ్‌ను మింగేసింది. తన చేతివేలికి రింగ్ లేకపోవడంతో... తాను నిజంగానే రింగ్ మింగేశానన్న విషయం ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది.

కల చూస్తూ ఎంగేజ్‌మెంట్ రింగ్ మింగేసింది ఓ యువతి. పొద్దున్న లేచి చూసే సరికి అదంతా కలే కదా అని భావించింది. రింగ్ కోసం వెతకడం ప్రారంభించింది. అయితే ఎక్కడా రింగ్ కనిపించకపోవడంతో.. తాను నిజంగా రింగ్ మింగేశానని కలలో కాదని రియలైజ్ అయ్యి ఏడుస్తూ డాక్టర్‌ వద్దకు వెళ్లింది. ఎక్స్‌రే తీసిన డాక్టర్ షాక్ అయ్యాడు. అమ్మాయి కడుపులో నిజంగానే రింగ్‌ ఉన్నట్లు గుర్తించాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. జెన్నా ఈవన్స్ అనే యువతికి... బాబ్ హోవెల్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. వీరద్దరీ ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయ్యింది. అయితే ఓ రోజు నిద్రపోతూ కలలో తన చేతికి ఉన్న ఎంగేజ్ మెంట్ రింగ్‌ను కాపాడేందుకు మింగేశానని పేర్కొంది. ఓరోజు రాత్రి జెన్నా కల చూశానని పేర్కొంది. తనకు చాలా స్పష్టమన కలలు వస్తాయని అందులో ‘ కలలో బాబీ, జెన్నా హైస్పీడ్ ట్రైన్‌లో వెళ్తున్నారు. అంతలో కొందరు దండగులు వారిపై దాడి చేసి దోచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో జెన్నా తన చేతికి ఉన్న ఎంగేజ్ మెంట్ రింగ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో దాన్ని నోటిలో వేసుకుంది. ఓ గ్లాస్ నీళ్ల సాయంతో రింగ్‌ను మింగేసింది’.


అయితే తెల్లారి లేచి చూసే సరికి కల నిజం కాలేదు కానీ. కలలో చేసిటన్లు నిజంగానే జెన్నా రింగ్‌ను మింగేసింది. తన చేతివేలికి రింగ్ లేకపోవడంతో... తాను నిజంగానే రింగ్ మింగేశానన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే తన ఫియాన్సి బాబ్‌కు విషయం చెప్పింది. అయితే అతను అది నమ్మకుండా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఇద్దరూ నవ్వారు. అయితే జెన్నా మాత్రం ఏడ్చేసింది. దీంతో కంగారు పడిన బాబ్ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్డక డాక్టర్లకు జరిగిన విషయం చెప్పారు. దీంతో డాక్టర్లు సైతం షాక్ తిని ఎందుకైన మంచిదని ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రేలో నిజంగానే జెన్నా కడుపులో రింగ్ ఉండటం చూసి అవాక్కయ్యారు. వెంటనే ఆమెకు ఎండోస్కోపి నిర్వహించారు. కడుపులో ఉన్న ఎంగేజ్ మెంట్ రింగ్‌ను బయటకు తీశారు.


ఇదంతా జెన్నా తన ఫేస్ బుక్ ఎకౌంట్లో పోస్టు చేసింది. తాను బాబ్‌ను ఎంతగానో ప్రేమిస్తానని పేర్కొంది. ఇప్పుడు అంతా మామూలుగానే ఉందని తెలిపింది. అయితే డాక్టర్లు రింగ్ తీసిన వెంటనే తనకు ఇవ్వకుండా తన ఫియాన్సి బాబ్‌కే ఇచ్చారని తెలిపింది. బాబ్ కూడా తనకు రింగ్ ఇవ్వకుండా కాస్త ఏడిపించాడన.. నేను మళ్లీ దాన్ని మింగనని ప్రామిస్ చేయడంతో తనకు ఇచ్చాడని పేర్కొంది.


First published:

Tags: America, VIRAL NEWS, Viral tweet, Viral video

ఉత్తమ కథలు