బొమ్మ కారుకు లైసెన్స్ ఉందా... మహిళ ప్రశ్నకు నవ్వుకుంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో..

కొంతమంది ప్రతిదానికీ చిరాకుపడుతూ ఉంటారు. పిల్లలు బొమ్మ కారుతో ఆడుకుంటుంటే... దానిపైనా ఫైర్ అయ్యిందో పెద్దావిడ. ఎందుకో తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 7, 2020, 12:03 PM IST
బొమ్మ కారుకు లైసెన్స్ ఉందా... మహిళ ప్రశ్నకు నవ్వుకుంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో..
బొమ్మ కారుకు లైసెన్స్ ఉందా... మహిళ ప్రశ్నకు నవ్వుకుంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో.. (credit - tik tok)
  • Share this:
అమెరికా... కాలిఫోర్నియా పార్కులో... ముగ్గురు పిల్లలు బొమ్మ కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నారు. అది చూసి... ఆ పిల్లల తల్లి సంబరపడింది. ఇంతలో ఓ మహిళ అటుగా వచ్చి... ఆ మహిళపై మండిపడింది. ఆ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని ప్రశ్నించింది. దాంతో ఈ వీడియో వైరల్ అయ్యంది. "ఈ పిల్లలు కారేసుకొని ఇదంతా తిరుగుతున్నారు. అలా ఎలా తిరగనిస్తారు" అంటూ ఆమె మండిపడిన వీడియోని టిక్ టాక్ యూజర్ @luna4boys04 పోస్ట్ చేశారు. "ఆ పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ పార్క్ ఉన్నది అందుకేగా" అంది పిల్లల తల్లి. "నేనెప్పుడూ ఇక్కడ కారును చూడలేదు" అందా పెద్దావిడ. "అది నిజమైన కారు కాదు. పవర్ వీల్స్ బ్యాటరీ కారు. అదో బొమ్మ కారు" అని క్లారిటీ ఇచ్చిందా తల్లి.

అయినా సరే ఆ పెద్దావిడ ఊరుకోలేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలు కారెలా నడుపుతారు. మీరెలా ఒప్పుకుంటారు అని ఫైర్ అయ్యింది. దాంతో నవ్విన ఆ తల్లి... "వాళ్లకు లైసెన్స్ ఏంటి... వాళ్లు పిల్లలు" అంది. అయినా ఒప్పుకోని ఆ పెద్దావిడ ఏదో నోట్లో నోట్లో సణుక్కుంటూ వెళ్తుంటే... ఆ తల్లి... "అది నిజం కారు కాదు" అని మరోసారి క్లారిటీ ఇచ్చింది.

@luna4boys04So what bothers her ?? Can someone please tell me. is she related to ##Karen ? Do I take my kids to the ##dmv? ##fy ##fyp

♬ original sound - luna4boys04ఈ నవ్వు తెప్పిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి ఇప్పటపికే 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 2.5 లక్షల లైక్స్, 12వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఇకపై పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్, వాళ్ల బొమ్మ కార్లకు రిజిస్ట్రేషన్ అన్నీ ఉండేలా చేసుకోవాలి అని ఓ నెటిజన్ సెటైర్ వేశారు. జాయ్ రైడింగ్, ఇల్లీగల్ యూటర్న్, నో లైసెన్స్, నో ఇన్సూరెన్స్, రెక్లెస్ డ్రైవింగ్, ఇంప్రోపర్ ట్యాగ్, నో బ్రేక్ లైట్, నో హెడ్ లైట్స్, బ్రోకెన్ టైలీ లైట్ అంటూ... మరో నెటిజన్ జోక్ చేశారు.
First published: June 7, 2020, 12:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading