కొందరు అనుకొకుండా చేసిన పనులు కొన్నిసార్లు వివాదస్పదమవుతుంటాయి. సోషల్ మీడియా (Social media) వచ్చాక.. ప్రతి ఒక్కరు తమ చుట్టు జరుగుతున్న ఘటనలను రికార్డు చేస్తున్నారు. నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్త వైరల్ (viral video) అవుతున్నాయి. కొన్ని సార్లు.. వైరల్ అవుతున్న వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని సార్లు ఆశ్చర్యకంగాను ఉంటున్నాయి. కొందరు కావాలని వింత పనులు చేస్తుంటారు. కావాలని అవతలి వారిని ఇబ్బందులు పెట్టాలని చూస్తుంటారు. దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట్లో వదులుతారు. దీంతో చాలా మంది తమ ప్రవర్తనను మార్చుకుంటారు. అయితే, కొన్ని వీడియోలు వివాదస్పదం కూడా అవుతుంటాయి. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
The most criminal activity I’ve ever seen on an airplane. This woman was hopping over other passengers the whole 7 hour flight. @PassengerShame pic.twitter.com/drET3BGBWv
— brandon???? (@In_jedi) June 15, 2022
పూర్తి వివరాలు... సాధారణంగా విమానంలో అందరు చాలా హుందాగా ఉంటారు. అయితే, ఒక యువతి మాత్రం.. విమానంలో వింతగా ప్రవర్తించింది. ఆమె చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది. ఆమెకు ఎయిర్ పోర్టు అధికారులు కిటీకి పక్కన సీటు కేటాయించారు. అయితే, ఆమె ముగ్గురిని దాటుకుంటు వెళ్లిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. యువతి.. సీటులో కూర్చున్న వ్యక్తుల మీదుగా దాటుకుంటు వెళ్లింది. ఆమె వారు కూర్చున్న సీటు హ్యండిల్ మీద కాలుపెడుతు.. వెళ్లి వారికి అసౌకర్యాన్ని కల్గచేసింది.
దీన్ని అక్కడే ఉన్న మరో ప్రయాణికులు రికార్డు చేశాడు. అతను వీడియోను సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు.. అలా వెళ్లడం దేనికి.. నడుచుకుంటు వెళ్లోచ్చు కదా.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు. తోటి ప్రయాణికులను ఇలా అసౌకర్యానికి గురిచేయ్యటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా కోతులు (Little monkey) సాధారణంగా స్వేచ్ఛగా ఉండటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటాయి.
అసలు ఒక చోట కుదురుగా ఉండవు. అలాంటి ఒక కోతి పిల్లను తీసుకొచ్చి జూలో పెట్టారు. మనం సాధారణంగా జూలల్లో బోనులలో కోతులను చూస్తుంటాం. కొన్ని సార్లు అవి బోను నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే, ఇక్కడో కోతి కూడా అలాగే ప్రయత్నించింది.
కోతి పిల్ల ముందు ఒక రాయి కన్పించింది. వెంటనే అది తీసుకుని దాని ముందున్న అద్దం మీద పదే పదే కొట్టింది. ఈ క్రమంలో అద్దం కాస్త పగిలింది. వెంటనే కోతి అక్కడి నుంచి భయంతో పారిపోయింది. అద్దానికి అన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. పాపం.. కోతి పిల్లను విడుదల చేయండి., కోతిని హింసించ వచ్చు.., దాని స్వేచ్చను హరించే హక్కు మీకు లేదంటూ .. కామెంట్ లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airlines, Trending video, Viral Video