చాలా సంవత్సరాల క్రితం ఇంటి గోడలపై, తలుపులపై ఓ స్త్రీ రేపు రా అనే పదాలు రాసి ఉండటం చూశాం. దెయ్యాలు, భూతాల నుంచి భయపడే వాళ్లు ఈవిధంగా రాసుకున్నట్లుగా అప్పట్లో ఓ ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా ఓ స్త్రీ (Woman) అర్ధరాత్రి (Night)వేళ ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా (Naked)వీధుల్లో తిరుగుతూ ప్రతి ఇంటి కాలింగ్ బెల్ మోగిస్తోంది. చంపుతానంటూ బెదిరిస్తూ అక్కడి ప్రజలను నిద్రపోనివ్వకుండా భయంతో చంపేస్తోంది. ఓ మహిళ నగ్నంగా అర్ధరాత్రి వేళ ఇంటి తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ మోగిస్తుండటంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో మహిళ నగ్నంగా భయపెడుతున్న వీడియో సోషల్ మీడియా(Social media)లో ప్రత్యక్షమవడంతో వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ (Viral)అవుతోంది.
అర్ధరాత్రి రోడ్లపై నగ్నంగా మహిళ..
ఒక మహిళ అర్ధరాత్రి సమయంలో ఒంటిపై బట్టలు లేకుండా ..నగ్నంగా వీధుల్లో తిరుగుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ మోగిస్తోంది. చంపుతానంటూ వార్నింగ్ ఇవ్వడం ఇంటి యజమానులు తలుపులు తెరిచేలోపే అక్కడి నుంచి మాయమైపోతోంది. భయపెట్టే విధంగా ఉన్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా మిలక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళ నగ్నంగా రోడ్లపై తిరగడం, ఇంటి కాలింగ్ బెల్ మోగించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సీసీ ఫుటేజ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈవీడియో కాస్త వైరల్‌గా మారింది.
#Rampur #viralvideo बिना कपड़ो वाली लड़की का वीडियो, लोगों को दे रही है जान से मारने की धमकी, ये वायरल वीडियो रामपुर जिले के मिलक थानाक्षेत्र का बताया जा रहा है, सीसीटीवी में दूसरों के घर की बजा रही है घण्टी...#Trending @rampurpolice @wpl1090 @UPPViralCheck @UpPolicemitra pic.twitter.com/tZ4MyNgN0J
— Atal Tv (@AtalTv_UP) February 2, 2023
ఇంటి కాలింగ్ బెల్ మోగిస్తున్న స్త్రీ..
రాత్రి వేళల్లో నగ్నంగా వచ్చి భయపెడుతున్న మహిళ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి వివరాలు రాబట్టారు. బట్టలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న అదృశ్య మహిళ ఆచూకిని గుర్తించారు. ఆమె ఎవరూ ..? ఎందుకు అలా చేస్తుందో .? మహిళ తల్లిదండ్రులతో మాట్లాడిన పోలీసులు షాకింగ్ న్యూస్ తెలుసుకున్నారు. మహిళ మానసీక ఆరోగ్యపరిస్థితి సరిగా లేదని గత ఐదేళ్లుగా బరేలీలో ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటోందని తేల్చారు.
వీడియో వైరల్ ..
అయితే అర్ధరాత్రి నగ్నంగా రోడ్లపై తిరగకుండా చూసుకోవాలని పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సూచించారు. దీని వల్ల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, శాంతిభద్రతలను సంరక్షించలేకపోతున్నారని పోలీసులను విమర్శిస్తూ స్థానికులు ట్వీట్‌లు, వీడియోలు పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి వీడియోలను షేర్ చేయవద్దని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video, WOMAN