news18
Updated: December 1, 2020, 5:36 PM IST
image credits Twitter
- News18
- Last Updated:
December 1, 2020, 5:36 PM IST
పిల్లిమొగ్గలు (flips) అంటే చిన్న విషయం కాదు. అందునా ఉల్టా వేయాలంటే మరింత కష్టమైన పని ఇందుకు బోలెడంత నైపుణ్యం, శారీరక సామర్థ్యం (fitness) కావాలి. స్టంట్ ప్రొఫెషనల్స్, జిమ్నాస్టులు (gymnasts) వీటిని సునాయాసంగా క్షణాల్లో చేసేస్తారు. అంతేకాదు ఇవి చేసేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పెద్ద ప్రమాదాలు జరిగి, మంచాన పడటం ఖాయం. ఇక ఇలాంటి ఫీట్లు చేయాలంటే మాత్రం అందుకు సరిపోయే sports wear ధరించటం తప్పనిసరి. కానీ ఓ మహిళ దీన్ని ఒక సవాలుగా తీసుకుని మన సంప్రదాయ వస్త్రాలైన చీరలోనే బ్యాక్ ఫ్లిప్స్ (backflips) చేసి అందరి మనసులు చూరగొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జూన్ నెలలో కూడా సంగీతా వారియర్ అనే నెటిజన్ ఇలా చీరలో బ్యాక్ ఫ్లిప్స్ చేస్తున్న అమ్మాయి వీడియో షేర్ చేశారు. 'Indian women are superwomen” అనే క్యాప్షన్ తో దీన్ని అద్భుతంగా ట్వీట్ చేశారని అందరూ మెచ్చుకున్నారు. పలువురు ప్రముఖులను సైతం ట్యాగ్ చేసిన ఈ వీడియో అప్పట్లో భలే వైరల్ అయింది. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, కిరణ్ రిజిజు వంటి వారిని ట్యాగ్ చేశారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. మిలి సర్కార్ (Mili Sarkar) అనే మహిళ చేసిన ఈ ఫీట్ ను ఆకాష్ రానిసన్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.
మగవారి కంటే గొప్పగా...
మగవారు చేయగలిగినవన్నీ మహిళలు కూడా చేయగలరు, సరిగ్గా చెప్పాలంటే మగవారికంటే గొప్పగా చేయగలరని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. అసలు పురుషులు చేయలేనివి ఎన్నో స్త్రీలు చాలా ఈజీగా చేయగలరని మరికొందరు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తుండటం వైరల్ గా మారింది. మిలీ సర్కార్ అనే మహిళ చీరలో బ్యాక్ ఫ్లిప్ చేసి తన ప్రత్యేకతను చాటుకుంది. ఈమె వీడియో చూసినవారంతా మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు ఈమె Powerhouse of Talent అంటూ అభినందనలు కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. Viral: తల్లి ప్రేమ.. ధైర్యం ముందు ఎంతటి బలవంతులైనా దిగదుడుపే...
జిమ్నాస్ట్ విక్రం సెల్వం కూడా..
విక్రం సెల్వం (Vikram Selvam) అనే వ్యక్తి సెప్టంబరులో ఇలాంటి అరుదైన ఫీట్ ఒకటి చేసి అందరి దృష్టి ఆకర్షించి, ప్రశంసల వర్షంలో తడిసిముద్దయ్యాడు. ఈయన చేసిన ఇలాంటి బ్యాక్ ఫ్లిప్స్ వీడియోకు ఇన్ స్టాలో ఏకంగా 7 మిలియన్ల వ్యూస్ వచ్చిపడ్డాయి. జిమ్నాస్ట్ అయిన విక్రం స్కిల్ ను నెటిజన్లు విపరీతంగా లైక్ చేసి, షేర్ చేశారు.
చీరతో మారథాన్ ఇంకా ఈజీ...
సాధారణంగా చీర అనగానే చీరలో అంత కంఫర్టబుల్ గా ఉండదని, చీరలో పరిగెత్తడం వంటివి చేయలేమని భావించడం సర్వసాధారణం. కానీ చీర ధరించి ఏపనైనా చేయగలమని రుజువు చేసే ఇలాంటి వీడియోలు తరచూ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆమధ్య ప్రముఖ ఫిట్నెస్ ఫ్రీక్, నటుడు, మోడల్ మిలింద్ సోమన్ సైతం చీర ధరించి మారథాన్ లో పాల్గొన్నారు. మిలింద్ సతీమణి అంకితా కొణ్వర్ కూడా చీరలో మారథాన్ లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఓరకమైన అథ్లెట్లని, వారు చాలామటుకు చీరలే ధరించి, పరిగెత్తడం, బరువులు చేయడం, ట్రెక్కింగ్ వంటివన్నీ సునాయాసంగా చేయగలిగినప్పుడు మిగతావారెందుకు చేయలేరని మిలింద్ సోమన్ (Milind Soman) లేవనెత్తిన అంశం ట్రెండింగ్ (trending) గా మారింది.
Published by:
Srinivas Munigala
First published:
December 1, 2020, 5:36 PM IST