హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Woman: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.. అందుకు ఈ మహిళ ఒక ఉదాహరణ.. మనందరికీ ఆదర్శం..

Woman: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.. అందుకు ఈ మహిళ ఒక ఉదాహరణ.. మనందరికీ ఆదర్శం..

భన్వారీ షెకావత్ (ఫైల్ ఫోటో)

భన్వారీ షెకావత్ (ఫైల్ ఫోటో)

భన్వారీ షెకావత్ ఝుంఝునులోని వివేక్ నగర్‌లో నివసిస్తున్నారు. భన్వారీ భర్త సురేంద్ర సింగ్ షెకావత్ జుంజును డీజే కోర్టులో న్యాయవాది.

చదువుకోవాలనే పట్టుదల ఉండాలనే కానీ.. అందుకు వయసు ఏ మాత్రం అడ్డురాదనే విషయాన్ని అనేకమంది అనేక సందర్భాల్లో రుజువు చేశారు. తాజాగా ఇదే విషయాన్ని రాజస్థాన్‌కు చెందిన 53 ఏళ్ల మహిళ భన్వారీ షెకావత్ మరోసారి చాటిచెప్పారు. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాకు చెందిన భన్వారీ షెకావత్ సికార్‌లోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్‌ను అభ్యసిస్తున్నారు. చదువుకోవాలనే తపన, ఆశ ఉండాలనే కానీ.. అందుకు వయసు ఏ మాత్రం అడ్డుకాదని భన్వారీ షెకావత్ నిరూపించారు. చదువుకు వయసు లేదని భన్వారీ చాటిచెప్పారు. 53 ఏళ్ల భన్వారీ భన్వారీ 51 సంవత్సరాల వయస్సులో 12వ బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా మొత్తం రాజస్థాన్‌లో మంచి ర్యాంకు సాధించారు. ఆమె 12వ తరగతి పరీక్ష రాయడానికి 33 ఏళ్ల తర్వాత మళ్లీ చదువు ప్రారంభించారు.. రెండేళ్ల క్రితం వచ్చిన 12వ ఫలితాలు చూసి భన్వారీ భర్త షాక్ అయ్యారు. .

భన్వారీ షెకావత్ ఝుంఝునులోని వివేక్ నగర్‌లో నివసిస్తున్నారు. భన్వారీ భర్త సురేంద్ర సింగ్ షెకావత్ జుంజును డీజే కోర్టులో న్యాయవాది. భన్వారీ షెకావత్ 1986లో మహారాష్ట్ర బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయ్యారు. పదో తరగతి పాసైన తర్వాత పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం ఆమె ఝుంఝునుకి వచ్చేశారు. ఆ తరువాతచదువులు కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే కోరిక మాత్రం ఆమెలో అలాగే ఉండిపోయింది.

భన్వారీ గ్రాడ్యుయేషన్ చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె భర్త సురేంద్ర సింగ్ తెలిపారు. దీంతో 2019 లో ఆమెకు ఓపెన్ బోర్డు నుండి ఫారమ్‌ను నింపారు. అప్పటికే ఆమె చదువు మానేసి దాదాపు 33 ఏళ్లు కావడంతో.. 0వ తరగతి పుస్తకాలు చదవడం ప్రారంభించారు. రోజూ ఇంటి పనులన్నీ చేస్తూ మధ్యాహ్నం మూడు నాలుగు గంటలు చదువుకునేది.

పబ్‌జీ ఆడుతూ ప్రేమలో పడ్డ జంట.. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. చివరకు

OMG: అద్భుతం చేసిన కరోనా టీకా.. మూగ వ్యక్తికి మాటలు.. చచ్చుబడిన శరీరంలో కదలికలు

భన్వారీ ఓపెన్ బోర్డు నుంచి ఫారమ్ నింపినప్పటికీ.. ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారని భర్తతో సహా కుటుంబంలో ఎవరూ నమ్మలేదని భన్వారీ తెలిపారు. కొందరు బంధువులు ఇప్పుడు చదువు ఎందుకు అని ఆమెను నిరుత్సాహపరిచారు. అయితే ఆమె మాత్రం చదువుకోవాలనే తన కోరికను వదిలిపెట్టలేదు. ఆ దిశగా కష్టపడ్డారు. 2020లో రిజల్ట్ రాగానే అందరూ షాక్ అయ్యారు. రాజస్థాన్‌లో భన్వారీ అగ్రస్థానంలో నిలిచారు. ఫలితం చూసి కష్టానికి, అంకితభావానికి షార్ట్‌కట్‌ లేదన్న నమ్మకం తనకు వచ్చిందని భన్వారీ తెలిపారు.

First published:

Tags: Trending news

ఉత్తమ కథలు