Orders watch in flipkart recevies cow dung cakes : ఈ రోజుల్లో అన్ని పనులు మన చేతుల్లోనే చిన్న గాడ్జెట్ అంటే మొబైల్ ద్వారా జరిగిపోతున్నాయి. చిన్న చిన్న వాటి కోసం మీరు మార్కెట్‌కి పరుగెత్తే అవసరం లేకుండా ఇప్పుడు మీ ఫోన్ లోని ఒకే క్లిక్‌లో వస్తువులు మీ ముందు కనిపిస్తాయి. అయినప్పటికీ, దీనితో ప్రమాదాలు కూడా ఉన్నాయి, ఇది కొన్నిసార్లు అధికం అవుతుంది. ఉత్తరప్రదేశ్(UttarPradesh)లో కూడా అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబికి చెందిన నీలం యాదవ్ అనే అమ్మాయి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్*Flipcart Big Billion Sale) సందర్భంగా తన కోసం వాచ్(Watch)ని ఆర్డర్ చేసింది. వాచ్ ధర రూ.1304. అక్టోబరు 7న నీలం యాదవ్ కి ఫ్లిప్ కార్డ్ నుంచి పార్శిల్ వచ్చింది. ఇంటికొచ్చిన పార్శిల్ ను డబ్బులు చెల్లించి తీసుకుంది నీలం. అయితే ఆ రోజు సాయంత్రం పార్శిల్ ని తెరిచి చూసింది నీలం. అయితే ఆమె అందుకున్న పార్శిల్ లోపల వాచ్‌కు బదులుగా నాలుగు ఆవు పిడకలు(Cow Dung Cakes) ఉన్నాయి. అయితే ఆన్ లైన్ షాపింగ్ ల కారణంగా ఇలాంటి ఘటన తెరపైకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఒక వ్యక్తి ఆన్లైన్లో మొదటిసారిగా ఓ డ్రోన్‌ని ఆర్డర్ చేయగా దానికి బదులుగా అతనికి 1 కిలోల బంగాళాదుంపలు డెలివరీ చేయబడ్డాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఒక వ్యక్తి తన కోసం ఫ్లిప్‌కార్ట్ నుండి ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేసాడు, కానీ బదులుగా అతనికి కొన్ని వాచ్ ని ఇంటికి పంపారు. ఇది మాత్రమే కాదు, ఇంతకు ముందు ఒక కోయంబత్తూరు వ్యక్తి.. పిల్లలకు ఐస్ క్రీం, చిప్స్ ఆర్డర్ చేయగా అతనికి 2 ప్యాకెట్ల కండోమ్‌లు వచ్చాయి.
Bihar : మద్యం తాగి పట్టుబడితే అక్కడ రాజభోగమే .. వీఐపీ డ్రింకర్స్కి లగ్జరీ సౌకర్యాలు
చత్తీస్గడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా సుక్మా బ్లాక్‌లోని మరోకి గ్రామంలో ఓ విచిత్రమైన తాగునీటి పంపు ఉంది. సుమారు 19ఏళ్ల క్రితం ఈప్రాంతంలో బోర్ వేయడానికి వచ్చిన వాళ్లు నీటి కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో 10అడుగుల లోతులోనే నీరు పడటంతో బోర్ వేసి వెళ్లిపోయారు. గ్రామంలో సుమారు రెండు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ పంపును నుంచి ఎవరూ కొట్టకుండానే నీరు రావడం విశేషంగా గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలో వేసిన ఈ పంపు స్థానంలో పాతాళగంగ ఉందా అన్నట్లుగా ఏడాది పొడవున నిత్యం మంచినీరు వస్తూనే ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సీజన్‌తో పని లేకుండా ..మండు వేసవిలో కూడా మరొకి గ్రామంలో కాపురం ఉంటున్న రెండు వందల కుటుంబాల ప్రజలు మంచి నీరు కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదంటున్నారు. కనీసం బోర్ కొట్టాల్సిన అవసరం కూడా రాలేదని గొప్పగా చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Flipkart Big Billion Days, Online shopping, Smartwatch, Uttar pradesh