Home /News /trending /

WOMAN ORDERED FOR SWIMMING POOL FOR CHILDREN SEE WHAT SHE GOT BA GH

ఇదేందిది?.. మరీ విచిత్రం.. ఆన్ లైన్‌లో పిల్లల స్విమింగ్ పూల్ ఆర్డర్ చేస్తే.. ఏమొచ్చిందో చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా ఈ- కామర్స్ ప్లాట్ ఫాంలలో ఒక వస్తువు మనం ఆర్డర్ చేస్తే అది వచ్చే వరకు అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కొన్నిసార్లు ఆర్డర్ చేసిన వస్తువు ఒకటైతే మన దగ్గరికి వచ్చే వస్తువు ఇంకోలా ఉంటుంది.

సాధారణంగా ఈ- కామర్స్ ప్లాట్ ఫాంలలో ఒక వస్తువు మనం ఆర్డర్ చేస్తే అది వచ్చే వరకు అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కొన్నిసార్లు ఆర్డర్ చేసిన వస్తువు ఒకటైతే మన దగ్గరికి వచ్చే వస్తువు ఇంకోలా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మనం అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం అలాంటి ఘటనే జరిగింది. స్కాట్లాండ్‌లోని మాక్ డఫ్ ప్రాంతానికి చెందిన క్లైరీ మెక్ డోనాల్డ్ తన పదకొండేళ్ల కూతురు కోసం ఆన్ లైన్‌లో ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్‌ టబ్‌ను ఆర్డర్ చేసింది. ఎండాకాలంలో తన కూతురు అమీ చిన్న సైజు స్వాడిల్ పూల్‌లో ఈత కొడుతూ ఆనందిస్తుందని ఆమె భావించింది. కానీ వచ్చిన వస్తువును చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ వచ్చిన స్విమ్మింగ్ పూల్ కేవలం కొన్ని అంగుళాల వెడల్పు మాత్రమే ఉంది. ఒక టీవీ రిమోట్ మాత్రమే పట్టేంత సైజులో ఉంది ఆ స్విమ్మింగ్ పూల్.

‘ఈబే నుంచి వచ్చిన ఆ పార్సిల్‌ను ఆమె విప్పి చూడగా.. అతి చిన్న పూల్ కనిపించింది. అందులో రెండు కాళ్లు పెట్టుకొని ఫుట్ స్పాగా మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. మా స్విమ్మింగ్ పూల్ మరీ పెద్దగా లేకుండా మామూలు సైజులో ఉండాలని భావించాను. అందుకే మినీ పూల్ ని కొనుగోలు చేశాను. దాని వల్ల నీళ్లు నింపడానికి సులువుగా ఉంటూ పెద్ద స్థలం ఆక్రమించకుండా ఉంటుందని అనుకున్నాను. కానీ ఆ వచ్చిన పార్సిల్ విప్పి చూడగానే చిన్న స్విమ్మింగ్ పూల్‌ని చూసి పగలబడి నవ్వేశాను. సాధారణంగా ఈబేలో ఇలాంటి తప్పులు పెద్దగా జరగవు. కానీ ఇది నా పొరపాటు అనుకుంటాను’ అని క్లైరీ వివరించారు.

ఆన్ లైన్ లో   ఆర్డర్ ఇస్తే వచ్చిన అతి చిన్న స్విమింగ్ పూల్


ఆ మినీ పూల్ లో ఓ రిమోట్ పెట్టి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందామె. ‘నేను ఇందులో నీళ్లు నింపి మా పిల్లికి తాగడానికి పెడతాను. ఇది కనీసం అలాగైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నా’ అంటూ వెల్లడించింది క్లైరీ. ఇలాంటి తప్పిదాలు జరగడం ఆమెకి ఇది మొదటి సారి ఏమీ కాదు. ఆమె ఇంతకుముందు కూడా ఇలాంటి తప్పిదాలు చేసిందట. ఒకసారి సగం బంగాళాదుంప మాత్రమే పట్టగలిగినంత సైజులో ఉన్న ప్యాన్ కొనుగోలు చేసింది. మరోసారి చిన్నపాటి రగ్గును ఆర్డర్ చేసిందట. హార్ట్ షేప్ లో ఉన్న రగ్గు అందంగా ఉందని కొనుగోలు చేసిందట. లివింగ్ రూమ్ మొత్తం కవర్ అవుతుందని కొంటే కనీసం ఒక సీటు నిండా కూడా పట్టనంత చిన్నదిగా వచ్చిందట. ఓసారి లాంప్ షేడ్ ని కొంటే అది వాళ్ల కూతురు సైజులో వచ్చిందట. అయితే పెద్దవి లేదా చిన్నవి ఆర్డర్ చేస్తావు కానీ అసలు సైజువి అస్సలు ఆర్డర్ చేయవంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను పరిహాసం చేస్తుంటారట.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Online business, VIRAL NEWS

తదుపరి వార్తలు