సాధారణంగా ఎవరైనా తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్లకు వెళుతుంటారు. అక్కడ తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొందరు అక్కడ కనిపించే ఇతర వ్యక్తులతో మాటలు కలుపుకుంటారు. మరికొందరు అక్కడ కనిపించే చిన్న పిల్లల చిలిపి చేష్టలు చూసి ఆనందిస్తుంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అసలు ఇలాంటి వ్యక్తి గురించి మనం ఎక్కడా విని ఉండం కూడా. షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఓ మహిళ.. అక్కడ ఓ ఏడాది బాబును చూసింది. అతడి తల్లితో మాటలు కలిపింది. కానీ ఆమె అడిగిన ప్రశ్న విని.. బాలుడి తల్లి షాకైంది. అక్కడి నుంచి పారిపోయింది. వివరాల్లోకి వెళితే.. రెబెక్కా లానెట్ టేలర్ అనే 49 ఏళ్ల మహిళ తన తల్లికి చిన్న పిల్లవాడిని కొనడానికి నాలుగున్నర కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది.
ఈ సంఘటన జనవరి 13న అమెరికాలోని టెక్సాస్ ప్రావిన్స్‌లో జరిగింది. ఏడాది వయసున్న చిన్నారిని కొనుగోలు చేసేందుకు బిల్లు చెల్లించేందుకు లైన్లో నిలబడిన మహిళ దగ్గరకు వెళ్లింది రెబెక్కా. ముందుగా బిల్ లైన్లో నిలబడి ఉన్న ఒక మహిళ చేతిలో తన ఏడాది పాపను చూసింది. ఆమె ఆ బాబును పొడగటం మొదలుపెట్టింది. పాపకు అందమైన జుట్టు, నీలి కళ్ళు ఉన్నాయని అతడి తల్లితో చెప్పింది. దీంతో ఆ తల్లి మురిసిపోయింది. ఈ బాబును ఎంత ధరకు అమ్ముతారని అడిగింది. అయితే రెబెక్కా ఏదో సరదా కోసం అలా అడిగి ఉంటుందని భావించింది బాలుడి తల్లి.
అయితే ఆ బాలుడికి 250,000 డాలర్లు ఇచ్చేందుకు సిద్ధంగా రెబెక్కా చెప్పింది. దీంతో బాలుడి తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను విన్నది నిజమేనా ? అని ఒక్క క్షణం అవాక్కైంది. అయితే రెబెక్కా ఆమెతో పదే పదే అదే విషయాన్ని చెప్పడంతో.. తన కొడుకును తాను ఎవరికి ఇవ్వబోనని ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోలేదు. తాను తన బాలుడిని అమ్మబోనని చెప్పిన తల్లిన రెబెక్కా వదల్లేదు. ఆమెను పార్కింగ్ స్థలం వరకు వెంబడించింది.
అంతేకాదు ఆ బాలుడి కోసం తాను రూ. 10 కోట్లు ఇవ్వడానికి కూడి సిద్ధంగా ఉన్నానని అరుస్తూ వెళ్లింది. బాలిక తల్లిని కచ్చితంగా తనకు బాలుడిని అమ్మాలని.. అలా జరగని పక్షంలో ఏ విధంగా అయినా తాను ఆ బిడ్డను దక్కించుకుంటానని కామెంట్ చేసింది. ఈ సంఘటన తర్వాత భయపడిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు జనవరి 18న రెబెక్కాను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆమె ఎందుకు అలా చేసిందనే దానిపై విచారణ చేపట్టారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.