మహిళ మెదడులో వింత జీవి... షాకైన డాక్టర్లు...

TapeWorm in Brain : బ్రెయిన్ ట్యూమర్‌కి సర్జరీ చేస్తూ న్యూయార్క్ డాక్టర్లు... టేప్ వార్మ్ (పాములాంటి పురుగు) గుడ్డు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 8, 2019, 9:16 AM IST
మహిళ మెదడులో వింత జీవి... షాకైన డాక్టర్లు...
మెదడులో కనిపించిన లార్వా (Image : Twitter / @Gizmodo
Krishna Kumar N | news18-telugu
Updated: June 8, 2019, 9:16 AM IST
న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్‌లో డాక్టర్లు... 42 ఏళ్ల మహిళ రాచెల్ పల్మాకు బ్రెయిన్ ట్యూమర్ (మెదడులో పుండు తొలగింపు) సర్జరీ చేస్తున్నారు. ఆ సమయంలో వారికి ఆమె మెదడులో ఓ చిన్నసైజు గుడ్డు కనిపించింది. ఆ గుడ్డును తొలగించిన డాక్టర్లు, దాన్ని ల్యాబ్‌కి పంపించారు. దాన్ని మైక్రోస్కోప్‌లో పరిశీలించగా... అది టేప్ వార్మ్ (పాము లాంటి పురుగు) గుడ్డు అని తెలిసింది. లార్వా దశలో ఉన్న ఆ జీవి... మరికొంతకాలం అలాగే ఉండి ఉంటే... మెదడులోనే ప్రాణం పోసుకొని... మెదడును తినేసేదే. లార్వా దశలోనే గుడ్డును తొలగిచడంతో... రాచెల్ పల్మాకి చాలా రిలీఫ్ లభించింది. ఇక ఆమెకు మరిన్ని సర్జరీలూ, ట్రీట్‌మెంట్లూ అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

Rachel Palma, Brain Tumor, Tapeworm, Neurocysticercosis Parasitic, Brain Infection, Taenia Solium Tapeworm, rare operation, brain surgery, రాచెల్ పల్మా, న్యూయార్క్ డాక్టర్లు, టేప్ వార్మ్, మెదడులో పురుగు, బ్రెయిన్ లో పురుగు,
మెదడులో కనిపించిన లార్వా (Image : Twitter / @Gizmodo


టేప్ వార్మ్ లార్వా దశలో ఉండటం అరుదు. అవి అపరిశుభ్రంగా ఉండే చేతులపై పెరుగుతాయి. ముఖ్యంగా బాత్‌రూంకి వెళ్లి, చేతులు సరిగ్గా కడుక్కోకుండా వచ్చే వారి చేతులపై టేప్ వార్మ్స్ పెరుగుతాయి. అవి క్రమంగా గాల్లో ఎగురుతూ... ఇతరుల్ని చేరతాయి. రాచెల్ పల్మా జుట్టులోకి చేరిన ఆ క్రిమి... మెదడులోకి గుడ్డును పంపించి ఉండొచ్చని డాక్టర్లు భావిస్తున్నారు.

సర్జరీకి ముందు రాచెల్ చాలా సమస్యలు ఎదుర్కొంది. తరచూ ఆమెకు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు (Hallucinations) అనిపించేది. తలనొప్పి వచ్చేది. మాటిమాటికీ అయోమయంగా అనిపించేది. సర్జరీ తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంది.

First published: June 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...