హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Emirates Ad : బుర్జ్ ఖలీఫా శిఖరంపై మళ్లీ ప్రత్యక్షమైన మహిళ.. ఒళ్లు గగుర్పొడిచే Video

Viral Emirates Ad : బుర్జ్ ఖలీఫా శిఖరంపై మళ్లీ ప్రత్యక్షమైన మహిళ.. ఒళ్లు గగుర్పొడిచే Video

నికోల్ స్మిత్ అనే మహిళ ఎమిరేట్ విమాన సిబ్బంది కాస్ట్యూమ్‌లో మరోసారి ప్రపంచంలోనే ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా పైకెక్కి నిలబడింది. ఆమె చుట్టూ భారీ ఏ380 విమానం చక్కర్లు కొట్టింది. దుబాయ్ ఎక్స్ పో ప్రమోషన్ కోసం ఎమిరేట్స్ రూపొందించిన తాజా యాడ్ చూస్తే ఒళ్లు ఝల్లుమంటుంది..

ఇంకా చదవండి ...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా అత్యున్నత శిఖరంపై నిలబడిన ఆ మహిళ మళ్లీ ప్రత్యక్షమైంది. నేనింకా ఇక్కడే ఉన్నానంటూ పలకరించింది. ఈసారి ఆమెకు డుగా ఓ భారీ విమానంసైతం వెంటపెట్టుకొచ్చింది. భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో నిలబడి నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని చకచకా చూపించేసింది. అసాధారణ సాహసంతో రెండోసారీ కనువిందు చేసిన ఆమె చర్య ఇప్పుడు కూడా సంచలనం రేపుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతోన్న దుబాయ్ ఎక్స్ పో 2020ని ప్రమోట్ చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సర్కారువారి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రూపొందించిన తాజా ప్రకటన తాలూకు వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయిమరి..

ఎమిరేట్స్ తాజా ప్రకటనను చూశారా? యూఏఈలో అతిపెద్ద విమానయాన సంస్థ ఎమిరేట్స్ గత వారం విడుదల చేసిన యాడ్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటన కోసం నికోల్ స్మిత్-లుడ్విక్‌ అనే మహిళ ఎమిరేట్ విమాన సిబ్బంది కాస్ట్యూమ్‌లో మరోసారి ప్రపంచంలోనే ఎత్తైన భవంతిపైకెక్కి నిలబడింది. ఎమిరేట్స్ ప్రమోషన్ కోసం గతేడాది ఆగస్టులో తొలిసారి నికోల్ బుర్జ్ ఖలీఫా శిఖరంపై నిలబడి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేయగా, ఇప్పుడు దుబాయ్ ఎక్స్ పో 2020 ప్రమోషన్ కోసం మరోసారి ఆ అసాధారణ ఫీట్ కనబర్చింది.

UP Elections 2022: 'బికినీ గర్ల్‌'పై బీజేపీ గరంగరం.. కలిపి చూడొద్దన్న Archana Gautamబుర్జ్ ఖలీఫాపై నికోల్భూమి నుంచి నుంచి 828 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జ్ ఖలీఫా భవంతి ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ అన్న సంగతి తెలిసిందే. ఆ బిల్డింగ్ శిఖరాగ్రంపై నిలబడి, చెప్పదల్చుకున్న విషయాన్ని ప్లకార్డులు తిరగేస్తూ నికోల్ ఆకట్టుకుంది. గత ఏడాది ప్రకటనలో ఆమె ఒక్కతే భవంతిపై కనిపించగా, ఈసారి భారీ ఏ380 విమానం కూడా ఆమెకు కంపెనీ ఇచ్చింది. నికోల్ బుర్జ్ ఖలీఫాపై నిలబడి ఉండగా, ఆమె చుట్టూ విమానం చక్కర్లు కొట్టింది. 59సెకన్ల నిడివి గల ఈ యాడ్ వీడియో నెట్టింట్ వైరలైంది. అంతేకాదు, యాడ్ మేకింగ్ వీడియోను కూడా జనం తెగ చూసేస్తున్నారు.

Covid చికిత్సలో కేంద్రం సంచలనం: మళ్లీ రెమ్‌డెసివీర్‌కు చోటు.. తీవ్రతను బట్టి వాడాల్సిన మందులివే

‘నేనింకా ఇక్కడే ఉన్నాను. వావ్.. నాకు దుబాయ్ ఎక్స్ పో కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిగొప్ప ప్రదర్శనను చూసేందుకు ఎమిరేట్స్ విమానం ఎక్కి వచ్చేయండి ఫ్రెండ్స్.. ’అని రాసున్న ప్లకార్డులను వరుసగా ప్రదర్శించింది నికోల్. ప్రొఫెషనల్ స్కైడైవింగ్ శిక్షకురాలైన ఈ మహిళతో ఎమిరేట్స్ రూపొందించిన రెండో ప్రకటన కూడా సూపర్ హిట్ అయింది.

Aahana Kumra: అగ్గిరాజేసిన ఆహానా కుమ్రా.. బిగుతైన బికినీలో అందాల విందు.. ఆహా అనాల్సిందే!

కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన దుబాయ్ ఎక్స్ పో 2020 ఎట్టకేలకు గతేడాది(2021) అక్టోబర్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ఈ ఏడాది(2022) మార్చి వరకు కొనసాగనుంది. నికోల్ చేతిలో దుబాయ్ ఎక్స్ పో తేదీలు, అక్కడ కలుద్దామని రాసున్న సందేశాల ఫొటోలను విమానంపై ముద్రించారు. ఎమిరేట్స్ యాడ్ జనవరి 14న విడుదలలై లక్షల వ్యూస్ లో దూసుకుపోతుండగా, జనవరి 17న మేకింగ్ వీడియోను సైతం విడుదల చేశారు.

First published:

Tags: Dubai, UAE, Viral Video

ఉత్తమ కథలు