• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • WOMAN LEFT MORTIFIED AFTER SENDING PHOTO TO LECTURER ORIGINALLY MEANT FOR BOYFRIEND SHARING HER STORY IN A REDDIT POST SU SU

బాయ్‌ఫ్రెండ్‌కు పంపాల్సిన ఫొటోను ప్రొఫెసర్‌కు పంపిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఫ్రతీకాత్మక చిత్రం

వాట్సాప్‌లో బాయ్‌ఫ్రెండ్‌కు పంపాల్సిన ఫొటోను ఓ మహిళను పొరపాటున ఆమె చదువుతున్న యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు పంపింది. అది అడల్ట్ కంటెంట్ కావడంతో తీవ్ర ఇబ్బంది పడ్డట్టు ఆమె చెప్పింది.

  • Share this:
    కొన్నిసార్లు తొందపాటులో చేసే పనులు తీవ్ర ఇబ్బందులకు దారితీస్తాయి. ముఖ్యంగా ఒకరికి పంపాల్సిన ప్రైవేట్ మెసేజ్ మరోకరికి వెళితే.. అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి పరిస్థితే ఒక మహిళకు ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె Reddit వేదికగా పంచుకుంది. అయితే ఆమె తన వివరాలను మాత్రం వెల్లడించలేదు. వాట్సాప్‌లో బాయ్‌ఫ్రెండ్‌కు పంపాల్సిన ఫొటోను పొరపాటున ఆమె చదువుతున్న యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు పంపింది. ఈ క్రమంలోనే ఆమెకు ఎదురైన ఇబ్బందికరమైన అనుభవాన్ని తన పోస్ట్‌లో వివరించింది.

    తన ప్రియుడు, ప్రొఫెసర్ ఫస్ట్ నేమ్స్ ఒకటేనని.. అలానే వారి పేర్లు ఫోన్‌లో సేవ్ అయ్యాయని ఆమె తెలిపింది. దీంతో కాంటాక్ట్ లిస్ట్‌లో ఆ పేర్లు వరుస క్రమంలో ఉన్నాయని చెప్పింది. ఇక, తన బాయ్‌ఫ్రెండ్ ఎప్పుడూ తనను ఆటపట్టించేవాడని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో వారి మధ్య అడల్ట్ జోక్స్ కూడా నడిచేవని తెలిపింది. ఈ క్రమంలోనే బుక్‌ స్టోర్‌లోని రొమాంటిక్ సెక్షన్‌లో ఓ బుక్‌ను చూసిన ఆమె.. దానిని కొనుగోలు చేసినట్టు నమ్మించడానికి బాయ్‌ఫ్రెండ్‌కు ఫొటో పంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం బుక్‌తో ఓ సెల్ఫీ తీసుకుంది. ఆ ఫొటోకు.. ‘నాన్న దయచేసి నన్ను క్షమించండి’ అనే క్యాప్షన్‌ను జతచేసింది.

    అయితే అనాలోచితంగా దానిని బాయ్‌ఫ్రెండ్‌కు బదులు తన యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు పంపింది. అయితే మహిళ చాలా సేపటి వరకు ఈ విషయాన్ని గుర్తించలేదు. తన క్యాబ్‌లో కూర్చొన్న తర్వాత.. అసలు జరిగింది చూసి షాక్‌కు గురైంది. అయితే అప్పటికే ఆ మెసేజ్‌కు బ్లూ టిక్స్ రావడంతో ఆమె ఏం చేయకలేకపోయింది. తాను పంపిన మెసేజ్ ప్రొఫెసర్ చూసినట్టు ఆమెకు అర్థం అయిపోయింది. టీచర్, స్టూడెంట్‌ల మధ్య ప్రోటోకాల్‌ను ఉల్లంఘించే విధంగా తప్పిదం జరిగినందుకు చాలా అవమానకరంగా ఫీల్ అయినట్టు ఆమె పేర్కొంది.

    ఇది చదవండి:  వ్యభిచార కూపంలో ఇద్దరు సినిమా నటీమణులు.. పోలీసులు దాడి చేయడంతో వెలుగులోకి.. ఆ ఆశతో..

    ఇది చదవండి: ఆఫీస్‌లో స్పై కెమెరా.. ఆ వీడియోతో ఓనర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన ఉద్యోగులు.. ఇంతకీ అందులో ఏముంది..?

    దీని గురించి తీవ్రంగా ఆలోచించిన ఆమె.. ప్రొఫెసర్ సారీ చెప్పాలని డిసైడ్ అయింది. పొరపాటున ఈ తప్పిదం జరిగిందని ప్రొఫెసర్‌కు మెసేజ్ చేసింది. అయితే ఆమెకు ప్రొఫెసర్ నుంచి రిప్లై రాలేదు. ఆ మరుసటి రోజు ప్రొఫెసర్ ఆమె మెసేజ్‌కు సమాధానం ఇచ్చారు. ‘ఇలాంటివి పవిత్రమైన స్టూడెంట్, టీచర్ సంబంధానికి చాలా విఘాతం కలిగిస్తాయి. నేను ఈ రకమైన ప్రవర్తనను క్షమించను’అని ప్రొఫెసర్ పేర్కొన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: