హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Woman Living on Water Diet: 41 ఏళ్ల నుంచి నో ఫుడ్..కేవలం నీళ్లు,నిమ్మకాయ రసం తాగి బతికేస్తున్న మహిళ

Woman Living on Water Diet: 41 ఏళ్ల నుంచి నో ఫుడ్..కేవలం నీళ్లు,నిమ్మకాయ రసం తాగి బతికేస్తున్న మహిళ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Woman Living on Water Diet : ప్రపంచంలో వివిధ రకాల వ్యక్తులు వారు వారి భావజాలం ప్రకారం వారి జీవితాన్ని గడుపుతారు. వియత్నాం(Viatnam)కు చెందిన ఓ మహిళ కూడా అలాంటి వింత జీవనశైలిని గడుపుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Woman Living on Water Diet : ప్రపంచంలో వివిధ రకాల వ్యక్తులు వారు వారి భావజాలం ప్రకారం వారి జీవితాన్ని గడుపుతారు. వియత్నాం(Viatnam)కు చెందిన ఓ మహిళ కూడా అలాంటి వింత జీవనశైలిని గడుపుతోంది. గత 41 సంవత్సరాలుగా తాను ఆహారాన్ని అస్సలు తీసుకోవడం లేదని, నీటిలో కొన్నింటిని జోడించి మాత్రమే తాగుతున్నానని (Woman living on water diet) ఆ మహిళ తెలిపింది.

ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ ప్రకారం..వియత్నాంకు చెందిన మిస్ న్గోన్ (Ms. Ngon) అనే మహిళ వయస్సు 63 సంవత్సరాలు. ఆమె తన వయస్సుకు తగినట్లుగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఆమెలో శక్తి లోపము లేదు. 21 సంవత్సరాల వయస్సు వరకు, ఆమె అన్నం మరియు ఇతర ఘనమైన ఆహారాన్ని తినేది ఆమెకు 22 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కడుపు సంబంధిత సమస్యలు, కళ్ళు మసకబారడం ప్రారంభించింది. పరీక్షల్లో రక్తసంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు తేలింది. ఎన్నో మందుల తర్వాత ఆమె ఇవన్నీ వదిలేసి వేసవిలో సాధారణంగా వినియోగించే షికంజిని తాగడం మొదలుపెట్టింది. అప్పటినుంచి ఎటువంటి ఘన పదార్థ రూపంలోని ఆహారాన్ని ఆమె తీసుకోవడం లేదు. కేవలం నీరు,చక్కెర,నిమ్మరసంతోనే ఆమె తన శరీరానికి అన్ని పోషకాలను అందిస్తోంది.

Murder : ప్రియుడితో కలిసి భర్తను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య

ఆమె గత 41 సంవత్సరాలుగా సాలిడ్ ఫుడ్ తినడం మానేసి నీటిలో కొన్ని గ్రాముల ఉప్పు, చక్కెర కలిపి,అదేవిధంగా నిమ్మరసం మాత్రమే తాగుతున్నట్లు పేర్కొంది. ఆశ్చర్యకరంగా, ఇది తన ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపలేదని తెలిపింది. ఆహారం వదిలిపెట్టిన తర్వాత కూడా తాను ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. తాను ఆహారం వదిలి నిమ్మరసం మాత్రమే తాగానని, చాలా సానుకూల ఫలితాలు కనిపించాయని ఆ మహిళ పేర్కొంది. ఓ డాక్టర్ సలహా మేరకు తాను ఇలా చేశానని,తాను ఇలా చేయడం వల్ల తన కంటి సమస్య తీరడంతోపాటు వ్యాధి కూడా మెరుగుపడటం ప్రారంభించినట్లు తెలిపింది. . ఇప్పుడు ఆమె యోగా మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ప్రజలకు చెబుతుంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: VIRAL NEWS, WOMAN

ఉత్తమ కథలు