Home /News /trending /

WOMAN KIDNAPPED BY 15 MEN IN TAMILNADU MAYILADUTHURAI VIDEO GOES VIRAL PAH

సినిమా స్టైల్లో యువతి కిడ్నాప్.. గేట్ పగులకొట్టి ఇంట్లో ప్రవేశించి.. యువతిని బలవంతంగా.. వీడియో వైరల్..

గేటు పగల గొడుతున్న దుండగులు

గేటు పగల గొడుతున్న దుండగులు

Tamil nadu: గేటును బలవంతంగా పగులకొట్టారు. దీంతో అలికిడికి ఇంట్లో వారు బయటకు వచ్చి చూశారు. అప్పుడు.. 15 మంది దుండగులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు.

దుండగులు బరితెగించారు. మూకుమ్మడిగా ఇంటికి పై దాడిచేశారు. గేట్లను పగుల కొట్టి.. ఇంట్లో ప్రవేశించారు. యువతిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. మిగతా కుటుంబ సభ్యులు ఎంతగా అరుస్తున్న ఏమాత్రం పట్టించుకోలేదు. స్థానికులు కూడా వారిదగ్గరకు వెళ్లడానికి సాహాసించడం లేదు. తమిళనాడులో  (Tamil nadu) జరిగిన ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మైలాడుతురై ప్రాంతంలో ఈ ఉదంతం జరిగింది. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తి.. యువతితో స్నేహం చేశాడు. ఆ తర్వాత.. ప్రేమిస్తున్నానంటు వెంటపడ్డాడు.

అతని వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీస్ స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. అప్పటి నుంచి అమ్మాయిపై మరింత కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. మంగళవారం రాత్రి.. 15 మంది దుండగులతో వెళ్లి యువతి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు. ఆతర్వాత.. ఆమెను బలవంతంగా.. బయటకు లాక్కొచ్చారు. ఇంట్లో వారు అరుస్తున్న ఏమాత్రం పట్టించుకోలేదు. అంతే కాకుండా.. ఆమెను కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు.





దుండగుడు మొబైల్ ఫోన్ ను ట్రాక్ చేశారు. జాతీయ రహాదారిపై కాపుకాసి.. దుండగులను పట్టుకున్నారు. అంతే కాకుండా విఘ్నేశ్వరన్, మరికొందరిని అరెస్టు చేశారు. యువతని ఆమె ఇంటికి పంపించారు. ఈ ఘటన అంతా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో వైరల్ గా (viral video)  మారింది.

టీనేజ్ యువకుడు రోడ్డుపై అడ్డమైన స్టంట్ లు వేశాడు.

టీనేజ్ యువకుడు బైక్ ను అడ్డదిడ్డంగా డ్రైవింగ్ నడిపిస్తున్నాడు. అతను తన బైక్ ను స్పీడ్ గా పోనిస్తున్నాడు. రోడ్డుమీద అనేక వాహనాలు వెళ్తున్నాయి. అయితే.. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. బైకర్.. స్పీడ్ గా వెళ్తుండగా బ్యాలెన్స్ అవుట్ అయ్యింది. అప్పుడు.. అతను ఎగిరి కిందపడ్డాడు. అతను పడిన వేగానికి టూవీలర్  ముందు వైపుకు దూసుకు పోయింది.

అతను రోడ్డుపై బొర్లుకుంటూ వెళ్లి మరోవైపున పడ్డాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది గతంలో జరిగింది. తాజాగా, ఢిల్లీ పోలీసులు (Delhi traffic police)  మరోసారి తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై అధికారులు.. అడ్డదిడ్డంగా వెహికిల్ నడిపి.. కింద పడితే.. తిరిగి అతికించడానికి ఎవరు దొరకరంటూ ఘాటుగా కామెంట్ చేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Tamil nadu, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు