Viral Video: జుట్టు సరిగా లేదనుకునవారు... లేదా... స్పెషల్ గెటప్ కోసమో కొంత మంది విగ్ (Wig) పెట్టుకుంటారు. జట్టు అనేది మనిషికి అందం, కాన్ఫిడెన్స్ తెస్తుంది. అందువల్ల విగ్ పెట్టుకున్నవారు... ఇదివరకటి కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. అయితే... ఆ విగ్గుతో చాలా తలనొప్పులు ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం సమస్యే. వాన పడినా, అతిగా గాలి వచ్చినా, మరే ఇతర కారణాల వల్లైనా నలుగురిలో ఉన్నప్పుడు విగ్ ఊడిపోతే... చాలా ఇబ్బంది పడతారు. కొంత మంది మాత్రం దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఓ యువతి విషయంలో అదే జరిగింది.
అమెరికా... జార్జియాలో స్విమ్మింగ్ చేద్దామని ఓ యువతి స్విమ్మింగ్ పూల్ ((Women in swimming pool))కి వెళ్లింది. కానీ నీటిలోకి జంప్ చెయ్యాలంటే ఆలోచించసాగింది. దాంతో కొంత మంది జంప్ చెయ్యమని ఆమెను ఎంకరేజ్ చేశారు. స్విమ్ సూట్లో జంప్ చేస్తూ... గిర్రున గాల్లో పల్టీ కొట్టి.. నీటిలోకి దూకింది. కానీ అలా పల్టీ కొట్టినప్పుడు... ఆమె విగ్ ఊడిపోయి... స్టాండ్‌పై పడింది. ఆమె నీటిలో పడింది. దాంతో అక్కడున్న వారు పకపకా నవ్వేశారు. విగ్ ఊడినప్పుడు చాలా మంది అది విగ్ అనుకోలేదు. ఓ క్షణం తర్వాత వారికి విగ్ అనే విషయం అర్థమైంది.
కొన్ని క్షణాలకు నీటి నుంచి పైకి వచ్చిన యువతి.. విగ్ ఊడిపోయిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయింది. నిరాశతో ఫేస్ పెట్టింది. అక్కడితో వీడియో ముగిసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటికే 3 లక్షల మందికి పైగా చూశారు. 10వేల మంది దాకా లైక్ చేశారు. 1800 మందికి పైగా షేర్ చేశారు. మంచి కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది షేర్ చేస్తున్నారు. టాలీవుడ్లో నూటొక్క జిల్లాల అందగాడు మొన్నే రిలీజైంది. అందులో హీరోకి బట్టతల ఉంటుంది. దాని వల్ల అతను ఎంత ఇబ్బంది పడ్డాడన్నది కథలో సారాంశం.
ప్రపంచంలో చాలా మంది ఈ జుట్టు ఊడిపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ఇప్పటివరకూ సరైన పరిష్కారం లేదు. అందువల్ల బట్టతల ఉన్నవారు నలుగురిలో అలా ఉండటాన్ని ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అలాంటి వారికి ఈ విగ్గులు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.