పవిత్రమైన వివాహ బంధంతో ఏర్పడిన కాపురాలు కూలిపోతున్నాయి. సోకులు, ఆఢంబరాలతో దాంపత్య జీవితాలు నిట్టనిలువునా చీలిపోతున్నాయి. నూరేళ్లు కలిసి జీవించాల్సిన ఆలుమగలు..చిన్న చిన్న విషయాలకు అలగడం, మనస్పర్ధలతో వేరు పడటం చివరకు కలిసి బ్రతకలేక కోర్టు ద్వారా విడాకులు పొందడం సర్వ సాధారణమైపోయింది. ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లో ఓ ఉత్తమ ఇల్లాలు తనకు బ్యూటీ పార్లర్(Beauty parlour)కి వెళ్లి మేకప్ (Make up)చేయించుకోవడానికి భర్తను డబ్బులు అడిగింది. ఇవ్వకపోవడంతో ..ఆలీగడ్(Aligarh)ఫ్యామిలీ కోర్టు(Family Court)లో తన భర్త నుంచి విడాకులు(Divorce)ఇప్పించమంటూ పిటిషన్ దాఖలు చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మేకప్‌కి డబ్బులు ఇవ్వలేదని విడాకులు..
రాను రాను కాపురాలు కాలక్షేపంగా మారుతున్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం కొందరు, కుటుంబ సభ్యుల ఒత్తిడితో మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని కొద్ది రోజుల్లోనే ఆ బంధాల్ని తెంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ధిల్లీలో నివహిస్తున్న అమిత్ అనే ఓ వ్యక్తి ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల పాటు సజావుగా సాగిన అమిత్ కాపురంలో కలహాలు రావడంతో భార్య, భర్తలు విడిపోయి జీవిస్తున్నారు. తన నుంచి విడిపోయి వేరే ఉంటున్న భార్య భర్త నుంచి తనకు భరణం ఇప్పించమంటూ ఆలీగఢ్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యంగా కోర్టులో సమర్పించిన పిటిషన్‌లో మేకప్ కోసం తన భర్త తనకు డబ్బులు ఇవ్వడం లేదని...ఇతర అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాడని సాకులు చూపించింది.
ముక్కలైన మూడు ముళ్ల బంధం..
2015లో వివాహం జరిగింది. నాలుగేళ్ల కాపురంలో భర్త ఆర్ధిక పరిస్థితిని చూసిన అమిత్ భార్య కేవలం తన ఆఢంబరాల కోసం భర్తతో విడిపోవడం...అటుపై భరణం ఇప్పించాలంటూ విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వార్త వైరల్ అవుతోంది.
కోర్టులో విడాకుల పిటిషన్..
వివాహమైన మహిళ మేకప్ డబ్బులు ఇవ్వలేదనే కారణం చూపిస్తూ భర్త నుంచి శాశ్వతంగా విడిపోవాలని తీసుకున్న నిర్ణయంపై భార్యా బాధితులు ఆశ్చర్యపోతున్నారు. సమాజంలో పరువు, ప్రతిష్టలను పక్కన పెట్టి కేవడం మేకప్‌కి ఇచ్చిన ప్రాధాన్యత వైవాహిక జీవితానికి ఇవ్వకపోవడం ఏమిటని షాక్ అవుతున్నారు. మరి ఈ విషయంలో ఆలీగడ్ ఫ్యామిలీ కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, VIRAL NEWS