ముఖానికి ఫేస్ క్రీమ్ పూసింది... కోమాలోకి వెళ్లింది

యాంటీ ఏజింగ్ క్రీమ్‌ను ముఖంపై వాడిన ఆమె ఆ తర్వాత అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెకు కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: September 18, 2019, 12:25 PM IST
ముఖానికి ఫేస్ క్రీమ్ పూసింది... కోమాలోకి వెళ్లింది
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమ్మాయిలు సాధారణంగా రకరకాల ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు. అందంగా కనిపించాలన్న తపనతో లేనిపోని హంగులు అద్దేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు మహిళలు అయితే తమ ఏజ్ ఎక్కువగా కనిపించకుండా ఉండేందుకు లేనిపోని క్రీములు పూసుకొని  చిక్కుల్లో పడుతుంటారు. 47ఏళ్ల మహిళకు ఇలాంటి చేదు అనుభవే ఎదురయ్యింది.  అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ ఫేస్ క్రీమ్ కారణంగా కోమాలోకి వెళ్లింది. ప్రత్యేకంగా మెక్సికో నుంచి క్రీమ్‌ను తెప్పించింది. యాంటీ ఏజింగ్ క్రీమ్‌ను ముఖంపై వాడిన ఆమె ఆ తర్వాత అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లినట్లు సాక్రమెంటో కంట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫేస్ క్రీమ్ వికటించి ఇలాంటి కేసు నమోదవ్వడం ఇదే మొదటిసారి అంటున్నారు.

అయితే, ఈ క్రీమ్ పూసుకోగానే ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, కొన్నిరోజులకే కోమాలోకి జారుకుంది. ఆమె వాడిన క్రీమ్ ను పరిశీలించిన వైద్యులు అందులో మిథైల్ మెర్క్యురీ అనే రసాయనం ఉన్నట్టు గుర్తించారు. కొన్ని అరుదైన సందర్భాల్లో ఆ రసాయనం విషప్రభావాన్ని సంతరించుకుంటుందని వివరించారు. అది కల్తీ ఫేస్ క్రీమ్ అయ్యుంటుందని, అందుకే వికటించి ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై పాండ్స్ కంపెనీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రాండ్ మిథైల్మెర్క్యురీ కలిగిన ఉత్పత్తులను తాము తయారు చేయమని పేర్కొంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి అధికారులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. సంస్థకు చెందిన తమ ఉత్పత్తులను అధికారిక అమ్మకందారుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని... వినియోగదారుల్ని కోరింది.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు